close

తాజా వార్తలు

Published : 28/11/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ప్యాకేజీతో లబ్ధి జరిగిందా?: కేటీఆర్‌

హైదరాబాద్‌: మతాన్ని అడ్డం పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేస్తూ నాలుగు ఓట్లు రాల్చుకోవాని భాజపా ప్రయత్నిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వేర్వేరుగా నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా ఒక్క రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా భాజపా, ఎంఐఎం నేతల వ్యవహార శైలిపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఒకరు సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటే.. మరొక్కరు సమాధులు కూలుస్తామంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు రావడం కాదు.. ఉన్న ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, ఎల్‌ఐసీని అమ్మేశారని అన్నారు. మత విద్వేషాలు సృష్టించి పిల్లల భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌కు తెరాస ఎంతో చేసిందని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని కేటీఆర్‌ వివరించారు. కర్ఫ్యూలు, కల్లోలాలు లేని ప్రశాంత హైదరాబాద్‌ను సాధించుకోవాలని అన్నారు. పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నారు. అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యులను కూడా ఆదరించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. తెరాసలో వారికి సముచిత గౌరవం కల్పించినట్లు చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని.. ఆయన నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఇతరత్రా ఎలాంటి సమస్యలున్నా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని