
తాజా వార్తలు
భాజపాపై 132కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి: కేటీఆర్
హైదరాబాద్: నగరానికి 2050 వరకు ఎలాంటి నీటి ఇక్కట్లు రాకుండా ప్రణాళికలు రూపొందించినట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అని అనుమానాలు లేవనెత్తారని అన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం కాదు.. ఉన్న పరిశ్రమలే పోతాయన్నారని చెప్పారు. కానీ గత ఆరేళ్లలో ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా హైదరాబాద్‌ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ ఉంటే వార్త.. ఇప్పడు కరెంట్ పోతే వార్త అని వెల్లడించారు. హైదరాబాద్‌లో పోకిరీల పోకడలు, ఆకతాయిల ఆగడాలు లేకుండా చేశామని వివరించారు.
ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ భాజపా విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఛార్జ్‌షీట్ వేయాల్సి వస్తే భాజపాపై 132 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఉందా?కరోనా కష్టకాలంలో హైదరాబాద్‌లో తిరిగింది ఎవరు? పది వేల రూపాయలు ఇస్తుంటే అడ్డుపడి.. ఇప్పుడు రూ.25 వేలు ఇస్తానంటున్నారు. 6.5 లక్షల మంది లబ్ధిదారుల జాబితా ఇస్తాం. వాళ్లకు రూ.25వేలు ఇప్పించండి. డిసెంబర్ 4 తర్వాత అర్హులందరికీ వరదసాయం అందుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి..
గ్లోబల్ సిటీ అని...ఫ్లడ్ సిటీగా మార్చారు
ప్రకాశ్ జావడేకర్పై రేవంత్‌రెడ్డి ఛార్జ్‌షీట్!