భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వాలి: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 17/06/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వాలి: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో విడత హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచడంపై ఇప్పటికే ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ నర్సరీలో మొక్కల పెంపకం తీరును బుధవారం మంత్రి పరిశీలించారు. అనంతరం నర్సరీలో ప్రస్తుతం ఎటువంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కలు కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీల నుంచి ఉచితంగా తీసుకోవచ్చని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా నర్సరీలో పనిచేసే అర్హులైన వారందరికీ పీఎఫ్‌ వంటి సౌకర్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని