close

తాజా వార్తలు

Updated : 06/11/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈనెల 20 నుంచి పాల సేకరణ: మంత్రి అప్పలరాజు

అమరావతి: ఏపీ అమూల్‌ ప్రాజెక్టులో భాగంగా ఈనెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ చేపడతామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 25వ తేదీన పాలకు సంబంధించిన బిల్లులను నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించి లాంఛనంగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని పాల సేకరణ కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మొదటి దశలో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రైవేటు, ప్రభుత్వ కొ-ఆపరేటివ్‌ డైయిరీల ద్వారా నిత్యం 70 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్ర వ్యా్ప్తంగా దాదాపు 5 లక్షలకుపైగా మహిళలు మినీ డైరీలు పెట్టుకుని స్వయం ఉపాధి పొందేందుకు ముందుకు వచ్చారని వివరించారు. సుమారుగా రూ.1360 కోట్లతో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన