కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటి?
close

తాజా వార్తలు

Published : 03/07/2020 18:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటి?

ప్రతి పక్షాలకు ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన తమ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు తగవని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలని సూచించారు. వర్షాకాలం చెరువులకు గండ్లు పడటం, వాటిని పూడ్చడం సహజమేనని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌, భాజపాకు నచ్చడం లేదని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ సైతం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని