చిన్నారి కోసం 200KM ప్రయాణించిన రైలు!
close

తాజా వార్తలు

Published : 27/10/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి కోసం 200KM ప్రయాణించిన రైలు!

లలిత్‌పూర్‌ (బిహార్‌): మూడేళ్ల చిన్నారిని కిడ్నాపర్‌ చెర నుంచి రక్షించేందుకు ఓ రైలు సుమారు 200 కిలోమీటర్లకు పైగా ఆగకుండా ప్రయాణించింది. ఎట్టకేలకు ఆ చిన్నారిని తల్లి చెంతకు చేర్చేలా చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయం విచారణ సమయంలో వెలుగుచూసింది.

యూపీలోని లలిత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని నివాసముండే ఓ మహిళ సోమవారం ఉదయం మూడు గంటలకు రైల్వే పోలీసులను ఆశ్రయించింది. తన మూడేళ్ల కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు చెప్పింది. దీంతో రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కిడ్నాపర్‌ అప్పుడే ఆ స్టేషన్‌ నుంచి భోపాల్‌వైపు వెళ్తున్న రప్తిసాగర్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్‌ తప్పించుకోకుండా ఉండేందుకు రైలును ఆగకుండా ప్రయాణించేలా చేశారు. అందుకోసం కంట్రోల్‌ రూమ్‌తో సమన్వయం చేసుకున్నారు.

ఆ రైలు మధ్యలో ఝాన్సీ స్టేషన్‌లో ఆగాల్సి ఉండగా.. చిన్నారి కోసం భోపాల్‌ వరకు పోనిచ్చారు. అలా లలిత్‌పూర్‌ స్టేషన్‌ను వీడిన రైలు సుమారు 241 కిలోమీటర్ల పాటు ఆగకుండా ప్రయాణించి భోపాల్‌కు చేరుకుంది. అప్పటికే మోహరించిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆ చిన్నారిని రక్షించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌ చేసింది ఆ చిన్నారి తండ్రేనని తేలింది. భార్యతో గొడవ పడి చిన్నారిని ఎత్తుకొచ్చేసినట్లు వెల్లడైంది. చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు.. భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ ఇప్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని