close

తాజా వార్తలు

Published : 01/08/2020 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లోకమాన్య తిలక్‌ శత వర్ధంతి.. మోదీ నివాళి

దిల్లీ: ‘లోకమాన్య’ బాల గంగాధర్‌ తిలక్‌ శతవర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు  నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ‘‘లోకమాన్య తిలక్‌ 100వ పుణ్యతిథి సందర్భంగా భారత్‌ ఆయనకు ప్రణమిల్లుతోంది. ఆయన మేధస్సు, ధైర్యం, న్యాయవర్తన, స్వరాజ్య భావన నిరంతరం స్ఫూర్తినిస్తాయి.’’ అంటూ  ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా లోకమాన్య జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.

ఈ స్వాతంత్ర్య సమర యోధుని అసలుపేరు కేశవ గంగాధర్‌ తిలక్‌. జులై 23, 1856లో జన్మించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన  బాల గంగాధర్‌ తిలక్‌ను భారత స్వాతంత్రోద్యమానికి ఆద్యుడిగా భావిస్తారు. భారత్‌లో వలస పరిపాలనకు తీవ్రంగా వ్యతిరేకించిన లాల్‌-బాల్‌-పాల్‌ త్రయంలో ఒకరైన తిలక్‌ను.. బ్రిటిష్‌ వారు ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ అన్‌రెస్ట్‌ అని పిలిచేవారు. పండితుడు, రచయిత, గణితవేత్త, తత్వవేత్త ఆయిన బాల గంగాధర్‌ తిలక్, ఆగస్టు 1, 1920న ముంబయిలో కన్నుమూశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.