close

తాజా వార్తలు

Published : 21/11/2020 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెట్‌లో డ్రెస్‌ కోడ్ ఉన్నట్టుందే: అనుష్క శర్మ

ముంబాయి: బాలీవుడ్‌ ప్రముఖ నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందన్నవిషయం తెలిసిందే.  తాజాగా తన షూటింగ్‌ జీవితం గురించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ వేదికగా ఓ ఫొటోను పోస్టు చేశారు. 

ఈ ఫొటోలో షూటింగ్‌ తిరిగి ప్రారంభమవుతున్నందున తన టీమ్‌ అందరు పీపీఈ కిట్లు, మాస్కులు ధరించారు. ఎందుకంటే అనుష్క తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని అంతేకాకుండా సెట్‌లో టీమ్‌ అంతా కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. 

ఈ ఫొటోతో పాటు ‘చూడబోతే ఈ రోజు సెట్‌లో డ్రెస్‌ కోడ్ ఉన్నట్టుందే’ అని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. 

అదే విధంగా, తనదైన శైలిలో బేబీ బంప్ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో తన చక్కటి అందమైన ఫొటోలతో ఇంటర్నెట్‌లో హల్ చల్‌ చేస్తున్నారు. ఇటీవలే విరాట్‌ కొహ్లీ తీసిన ‘ఛాయ్‌ టైమ్ ఫొటో’ అంటూ అనుష్క ఇన్‌స్టాలో తన అభిమానులతో పంచుకున్నారు.  

 Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని