close

తాజా వార్తలు

Published : 03/01/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జర్మనీ కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం

బెర్లిన్‌: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటిన వేళ జర్మనీలో విషాదం చోటుచేసుకుంది. సమీపంలో సంబరాలు జరుగుతుండగా.. క్రెఫెల్డ్‌ జంతు ప్రదర్శనశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 30కి పైగా మూగజీవాలు సజీవ దహనమయ్యాయి. అక్కడున్న వానర కుటీరం మంటల్లో బుగ్గిపాలైంది. అగ్నిధాటికి అనేక కోతులు, చింపాజీలు ఆహుతయ్యాయి. ఇందులో కోతి జాతిలో అరుదైన రకానికి చెందిన ‘ఏప్‌’ల గృహం పూర్తిగా దగ్ధమైంది. ఒరంగుటాన్‌, గొరిల్లా, గబ్బిలాలు సహా అనేక జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. మంటల్లో చిక్కుకున్న కొన్ని జంతువుల్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. నూతన సంవత్సర వేడుకలకు వినియోగించిన బాణసంచా కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని