close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120060867 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 8Oeluiq1f4s [video_short_link] => 8Oeluiq1f4s [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-05-06 13:27:53.366803 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 06/05/2020 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెచ్‌-1బీ వీసాదారులకు వేతనాలు తక్కువే!

ఎకనామిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యధిక కంపెనీలు హెచ్‌-1బీ వీసాదారులకు విపణిలో సాధారణ వేతనాలతో పోలిస్తే తక్కువ చెల్లిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయని తెలిపింది. ‘హెచ్‌-1బీ వీసాస్‌ అండ్‌ ప్రివెయిలింగ్‌ వేజ్‌ లెవెల్స్‌’ పేరిట ఎకనామిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

హెచ్‌-1బీ వీసాదారుల్లో 60శాతం మంది అక్కడి స్థానిక మధ్యస్థ వేతనం(లోకల్‌ మీడియన్‌ వేజ్‌) కంటే తక్కువ పొందుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. దిగ్గజ కంపెనీలు సైతం మీడియన్‌ వేజ్‌ కంటే తక్కువ ఉండే లెవెల్‌‌-1, లెవెల్‌-2 వేతనాలే ఇస్తున్నాయని తెలిపింది. ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌’ హెచ్‌-1బీ నిబంధనలు సైతం దీనికి అనుమతిస్తున్నాయని వెల్లడించింది. హెచ్‌-1బీ వీసాదారులకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే తొలి 30 కంపెనీల్లో సగానికిపైగా.. ఉద్యోగుల ఎంపికలో ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయని పేర్కొంది. అయితే, సాంకేతిక కంపెనీలు మాత్రం నేరుగా రిక్రూట్‌ చేసుకునేందుకే మొగ్గుచూపుతున్నాయని తెలిపింది. వేతనాల్లో మాత్రం లెవెల్‌-1, లెవెల్‌-2 విధానాన్నే అవలంబిస్తున్నాయి.

2019లో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఎంపికచేసుకున్న ఉద్యోగుల్లో 35 శాతం మందికి లెవెల్‌-1, 42శాతం మందికి లెవెల్‌-2 వేతనాలు ఆఫర్‌ చేసినట్లు నివేదిక తెలిపింది. అక్కడి స్థానిక మధ్యస్థ వేతనంతో సమానంగా ఉండే లెవెల్‌-3 వేతనం కేవలం 18శాతం మందికి మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, ఉబర్‌ సైతం ఇదే తరహాలో వేతనాలు చెల్లిస్తున్నాయని తెలిపింది.

ఇవీ చదవండి..

ఆంక్షల సడలింపుతో మరణాలు పెరగొచ్చు:ట్రంప్‌

ట్రంప్‌ని ఇరకాటంలోకి నెట్టిన ఫౌచి!



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.