close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 19/06/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వావ్‌..అప్పుల్లేని అంబానీ సామ్రాజ్యం..! 

 స్వర్ణ యుగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 మార్చి 2021 కంటే ముందే మాట నెరవేర్చిన ముఖేష్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వర్ణ యుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. భారత్‌లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. ‘‘ 2021 మార్చి31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను. వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉంది’’ అని శుక్రవారం ఉదయం ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లను సమీకరించింది. మరోపక్క జియో డిజిటల్‌ వ్యాపారంలోకి పెట్టుబడుల రూపంలో రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ కారణంగా రిలయన్స్‌ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది. 

కార్పొరేట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం

రిలయన్స్‌కు రూ.1,61,035 కోట్ల నికర అప్పు ఉండేది. దీనిని 2021 మార్చి 31 నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనికోసం చాలా వేగంగా రైట్స్‌ ఇష్యూస్‌, వాటాల విక్రయం చేపట్టింది. ఈ డీల్స్‌తో రిలయన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త గుర్తింపు వచ్చింది. భారత కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఒక రకంగా భారత కార్పొరేట్‌ శక్తిని ప్రపంచానికి తెలియ జేసినట్లైంది. కరోనావైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లు విధించిన సమయంలో ఈ డీల్స్‌ జరిగాయి. తొలుత రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూను జారీ చేసింది. ఇది భారత కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్దది. ఇది 1.59రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ జారీ చేసిన అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా ఇదే.  

జియోనే కీలకం..

రిలయన్స్‌ జియోలో మొత్తం 24.70 శాతం వాటాలను విక్రయించారు. మొత్తం 11 డీల్స్ చేసుకొన్నారు. ఏప్రిల్‌ 22 మొదలు తొమ్మిది వారాల్లో రూ.1,15,693.95 కోట్లను పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు. ఈ 11 డీల్స్‌ కాకుండా ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న మరో డీల్‌లో 9.99 శాతం వాటాను విక్రయించి రూ.43,573.62 కోట్లను తీసుకొచ్చారు. విస్తా, కేకేఆర్‌, సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లతో డీల్స్‌ నుంచి రూ.11,367 కోట్లు లభించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్ల ధర 1.68 శాతం పెరిగి రూ.1,684కు చేరింది. ఇది రిలయన్స్‌ జీవిత కాల అత్యధికం. గత కొన్నాళ్లుగా రిలయన్స్‌ షేరు క్రమంగా పెరుగుతూనే ఉంది. 

ఇది గర్వకారణం: ముఖేష్‌ అంబానీ

‘‘రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం గర్వకారణం. రిలయన్స్‌‌ స్వర్ణయుగంలో ఉందని నేను చెప్పగలను. సంస్థ వ్యవస్థాపకులైన ధీరుభాయ్‌ అంబానీ కలలను సాకారం చేసేలా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొంటుంది. భారత వృద్ధిలో నిరంతర భాగస్వామిగా ఉంటుంది’’ అని ముఖేష్‌ తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.