close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/06/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముకేశ్‌ అంబానీ వేతనం.. 12వ ఏడాదీ రూ.15 కోట్లే

దిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ వరుసగా 12వ ఏడాదీ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2019-20)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌గా రూ.15 కోట్లు మాత్రమే తీసుకున్న ఆయన.. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఆ తర్వాత వేతనం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్‌ అన్నీ కలిపి రూ.15 కోట్లే తీసుకుంటున్నారు. ఏటా దాదాపు రూ.24 కోట్లను వదులుకుంటున్నారు. ఇక నిఖిల్‌, హితాల్‌ మేస్వానీలతో పాటు కంపెనీ ఇతర శాశ్వత డైరెక్టర్ల వేతనాలు మాత్రం 2019-20లో భారీగా పెరగడం గమనార్హం. కొవిడ్‌-19 సంక్షోభం ముగిసేంత వరకు ముకేశ్‌ అంబానీ స్వచ్ఛందంగా వదులుకున్నారని కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. ముకేశ్‌ 2019-20 వేతనంలో రూ.4.36 కోట్ల జీతం, భత్యాలున్నాయి. 2018-19 జీతభత్యాలైన రూ.4.45 కోట్లతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఇక కమిషన్‌ రూ.9.53 కోట్లలో మార్పు లేదు. ఇతర భత్యాలు మాత్రం రూ.31 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెరిగాయి. ఇక పదవీ విరమణ ప్రయోజనాలు రూ.71 లక్షలుగా ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.