
తాజా వార్తలు
ధోనీ లేకుండా ముంబయికిది తొలి ఫైనల్
2017 మినహా అన్ని సార్లూ చెన్నైతోనే పోటీ..
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో ముంబయి, చెన్నై జట్లు అత్యంత విజయవంతమైనవిగా పేరున్న సంగతి తెలిసిందే. రోహిత్‌సేన ఇప్పటివరకు ఐదు సార్లు ఫైనల్లో తలపడగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. అన్నీ ధోనీసేన పైనే గెలుపొందడం విశేషం. మరోవైపు చెన్నై ఎనిమిది సార్లు ఫైనల్ చేరినా మూడు సార్లే విజయం సాధించింది. అయితే, ఈసారి ఆ జట్టు లీగ్ దశ నుంచే ఇంటి ముఖం పట్టగా ముంబయి ఆరోసారి ఫైనల్‌కి చేరింది. దీంతో చెన్నై తర్వాత ఆరు సార్లు ఫైనల్‌కు వెళ్లిన జట్టుగా ముంబయి నిలిచింది.
చెన్నై, ముంబయి జట్లు 2010లో తొలిసారి ఫైనల్లో తలపడ్డాయి. అప్పుడు ధోనీసేన 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదొక్కసారే ముంబయిపై ధోనీసేన గెలుపొందింది. ఆ తర్వాత 2013, 2015, 2017, 2019 ఇలా నాలుగుసార్లు ధోనీసేన ముంబయే విజయం సాధించింది. అయితే, 2017లో చెన్నై నిషేధంలో ఉండడంతో పుణె జట్టుపై రోహిత్‌సేన విజయం సాధించింది. కాగా, అప్పుడు పుణె కెప్టెన్‌గానూ ధోనీనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇప్పుడు తొలిసారి ఫైనల్లో ప్రత్యర్థి జట్టులో ధోనీ లేకుండా పోటీపడనుంది. అయితే ప్రత్యర్థి ఎవరనే విషయం ఆదివారం రెండో ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. ఇదిలా ఉండగా, ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది ఆరో ఫైనల్ కావడం గమనార్హం. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన అతడు తర్వాత 2010 నుంచీ ముంబయికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2009లో బెంగళూరుపై ఛార్జర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
