
తాజా వార్తలు
ముంబయి పాంచ్ పటాకా
ఇంటర్నెట్‌డెస్క్: పదమూడో సీజన్ లీగ్ విజేతగా ముంబయి నిలిచింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబయి అయిదో టైటిల్ సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (65*, 50 బంతుల్లో, 6×4, 2×6), పంత్ (56; 38 బంతుల్లో, 4×4, 2×6) రాణించారు. ఆ జట్టును బౌల్ట్ (3/30) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (68; 51 బంతుల్లో, 5×4, 4×6) అర్ధశతకంతో చెలరేగాడు.
ఛేదనకు దిగిన ముంబయికి మెరుపు ఆరంభం లభించింది. డికాక్ (20; 12 బంతుల్లో, 3×4, 1×6), రోహిత్ ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే అయిదో ఓవర్లో డికాక్‌ను స్టాయినిస్ బోల్తాకొట్టించాడు. కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (19; 20 బంతుల్లో, 1×4, 1×6) కూడా బ్యాటుకు పనిచెప్పడంతో ముంబయి పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్ స్పిన్నర్లకు బంతి అందించడంతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసర పరుగుకు రోహిత్ ప్రయత్నించగా.. సూర్యకుమార్ కెప్టెన్ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం హిట్‌మ్యాన్ చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ (33; 19 బంతుల్లో, 3×4, 1×6) కూడా మెరవడంతో ముంబయి విజయం దిశగా సాగింది. రోహిత్, పొలార్డ్ (9) స్వల్పవ్యవధిలోనే ఔటైనా ఇషాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. దిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, రబాడ, స్టాయినిస్ చెరో వికెట్ తీశారు.
రాణించిన శ్రేయస్- పంత్
అంతకుముందు టాస్ గెలిచిన దిల్లీకి పేలవ ఆరంభం దక్కింది. బౌల్ట్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బౌండరీల మోత మోగించింది. ఈ క్రమంలో పంత్ 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో శ్రేయస్-పంత్ 96 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హెట్మైయర్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ మూడు, కౌల్టర్‌నైల్ రెండు, జయంత్ ఒక వికెట్ తీశారు.
రికార్డులు
* లీగ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి (5). రెండో స్థానంలో చెన్నై (3) ఉంది.
* విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. లీగ్ ఫైనల్లో రెండు సార్లు అర్ధశతకం సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.
13వ సీజన్లో అవార్డులు
ఫెయిర్‌ప్లే అవార్డు: ముంబయి
ఆరెంజ్ క్యాప్: కేఎల్ రాహుల్ (670 పరుగులు)
పర్పుల్ క్యాప్: కగిసో రబాడ (30 వికెట్లు)
ఎమర్జింగ్ ప్లేయర్: దేవదత్ పడిక్కల్ (473 పరుగులు)
సూపర్ స్ట్రైకర్: పొలార్డ్ (191.42 స్ట్రైక్‌రేట్)
అత్యంత విలువైన ఆటగాడు: జోఫ్రా ఆర్చర్ (20 వికెట్లు, 10 సిక్సర్లు)
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
