ఏడాది జీతంతో నాన్న విమాన టికెట్‌ కొన్నారు

తాజా వార్తలు

Published : 08/06/2020 19:16 IST

ఏడాది జీతంతో నాన్న విమాన టికెట్‌ కొన్నారు

దిల్లీ : విద్యార్థులు విశాల దృక్పథంలో ఆలోచించి అభిరుచి ఉన్న రంగంలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సూచించారు. ఆదివారం ఓ వర్చువల్ స్నాతకోత్సవంలో సుందర్‌పిచాయ్‌ పాల్గొన్నారు. యూట్యూబ్‌లో ప్రసారం చేసిన ‘డియర్‌ క్లాస్‌ ఆఫ్‌ 2020’లో ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘బహశా సాంకేతిక అంశాలు మీకు చిరాకు తెప్పిస్తుంటాయి. అసహనం కలిగించి ఉండవచ్చు. ఆ అసహనాన్ని వదులుకోవద్దు. అదే మరో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుంది. మా జనరేషన్‌లో ఎవరూ కలలో కూడా ఊహించనవి సృష్టించేలా చేస్తుంది. మా జనరేషన్‌లో వచ్చిన వాతావరణ మార్పు, విద్యావిధానం మీకు కాస్త అసహనం కలిగించి ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనీయండి. రేపటి ప్రపంచానికి అవసరమైన పురోగతిని అదే సృష్టిస్తుందని’ పిచాయ్‌ పేర్కొన్నారు. 
27 సంవత్సరాల క్రితం భారత్‌ నుంచి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకోవడానికి అమెరికా వచ్చినపుడు జరిగిన సంఘటనలను సుందర్‌పిచాయ్‌ గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఏడాది జీతానికి సమానమైన మొత్తాన్ని నా అమెరికా విమాన టికెట్‌ కోసం ఖర్చు చేశారు. అందువల్లే నేను స్టాన్‌ఫోర్డ్‌లో అడుగుపెట్టగలిగాను. నేను విమానంలో ఎక్కడం అదే మొదటిసారి. కాలిఫోర్నియాలో ల్యాండ్‌ కాగానే నేను ఊహించిట్లుగా ఇక్కడ లేదు. అమెరికాలో అన్నీ చాలా ఖరీదే. ఇంటికి ఫోన్‌ చేస్తే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చు అయిపోయేవి. బ్యాగు కొనాలంటే మా నాన్న ఇండియాలో సంపాదించే రెండు నెలల జీతం వెచ్చించాల్సి వచ్చేది. కాలిఫోర్నియాలో అడుగుపెట్టినపుడు ఈ స్థాయిలో మార్పులు సంభవిస్తాయని ఊహించలేదు. ఇండియాలో ఉన్న వాడిని అక్కడిదాకా వెళ్లానంటే అది అదృష్టం కాదు. సాంకేతిక అంశాలపై నాకున్న అభిరుచి, విశాల దృక్పథం’ అంటూ తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. 

చెన్నైకి చెందిన సుందర్‌పిచాయ్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు . వార్టన్‌ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. 2004లో గూగుల్‌లో చేరి ఆ సంస్థ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. 


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని