close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/02/2020 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గాంధీజీ మీకు ట్రైలర్‌ కావొచ్చు.. మాకు జీవితం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోదీ

దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం నవీన భారత నిర్మాణాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతిపిత మహాత్మాగాంధీ కాంగ్రెస్‌కు కేవలం ట్రైలర్‌ మాత్రమే కావొచ్చు కానీ ఎన్డీయే ప్రభుత్వానికి ఆయనే జీవనాధారం అని అన్నారు. 

చారిత్రక మార్పులు సాధ్యమయ్యేవి కాదు

గత ప్రభుత్వ విధానాలనే ఇప్పటికే అనుసరిస్తే తమ ప్రభుత్వం చారిత్రక మార్పులు తీసుకొచ్చేది కాదని మోదీ తెలిపారు. ముమ్మారు తలాక్‌ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కలిగేది కాదని, రామజన్మభూమి సమస్య పరిష్కారమయ్యేది కాదని అన్నారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ వాస్తవరూపంలోకి వచ్చేది కాదన్నారు. భారత్‌-బంగ్లాదేశ్ మధ్య భూ ఒప్పందం, ఆర్టికల్‌ 370 రద్దు జరిగేవి కాదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అందర్నీ కలుపుకుని ముందుకు సాగుతోందని తెలిపారు.

పాలనలో పారదర్శకత, వేగం పెంచాం

‘ప్రపంచం భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనే సత్తా మాలో ఉంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వేచిచూసే పరిస్థితి లేదు. పాలనలో పారదర్శకత, వేగాన్ని తీసుకొచ్చాం. 37కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చాం. 11 కోట్ల మందికి వారి ఇళ్లల్లో మరుగుదొడ్ల సదుపాయం కల్పించాం. 13కోట్ల మందికి వంటగ్యాస్‌ సౌకర్యం అందించాం. రెండు కోట్ల మందికి సొంత గృహాలు నిర్మించి ఇచ్చాం. గత ఐదేళ్ల పాలన చూసే ప్రజలు మళ్లీ మాకు అధికారం అప్పగించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు. 

ఈశాన్యంలో కొత్త అధ్యాయం

ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కూడా మోదీ ప్రస్తావించారు. ఈశాన్య భారత్‌ను దిల్లీకి దగ్గర చేశామని, ఈశాన్యంలో కొత్త అధ్యాయం లిఖించామని తెలిపారు. అక్కడ ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఏడు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్‌ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆర్టికల్‌ 370 రద్దుతో వాటికి చరమగీతం పాడామన్నారు.   

వ్యవసాయం, రైతులపై ప్రత్యేక దృష్టి

వ్యవసాయం, రైతు సంక్షేమంపై స్పష్టమైన ఆలోచనను రాష్ట్రపతి ఆవిష్కరించారని మోదీ తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస మద్దతు ధర సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిదని చెప్పారు. పంట బీమా, నీటిపారుదల సంబంధిత పథకాలను తీసుకొచ్చామన్నారు. రాజకీయ లబ్ది కోసం కొన్ని రాష్ట్రాలు పీఎం-కిసాన్ పథకం ప్రయోజనాలను రైతులకు చేరనియ్యట్లేదని ఆరోపించారు. రైతు సంక్షేమంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కోరారు. రైతుల శ్రేయస్సు కోసం మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు

ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థను వృద్ధిలోకి తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ద్రవ్యలోటు, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూస్తున్నామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. జీఎస్‌టీతో ఆదాయం, విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యగుల సృష్టిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మదుపర్లలో విశ్వాసం పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పుకొచ్చారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.