
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 67,269 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,031 కేసులు నిర్ధారణ కాగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,65,705కి చేరింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 6,970 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,081 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,46,120కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 98,55,316 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కర్నూల్, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.