close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ఆంగ్ల మాధ్యమ సవాళ్లను అధిగమిస్తాం:జగన్‌

ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్‌) ఇక్కడి నుంచే వచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం (ఏయూ)లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో ఏయూ 14వ స్థానంలో ఉందని.. తొలి ఐదు స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆంగ్లమాధ్యమంతో బోధనా సమస్యలు కచ్చితంగా ఉంటాయని.. వాటిని అధిగమించి లక్ష్యం చేరుకుంటామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌..ఆ హామీలు ఏమయ్యాయ్‌?: ఉత్తమ్‌

తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే ఈ ఏడాది మొత్తం గడిచిపోయిందని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం తప్పిదాల వల్ల 26 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ముందు రుణమాఫీ, నిరుద్యోగభృతిపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ఉత్తమ్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సహ నిందితులే సలహాదారులు: చంద్రబాబు

అధికారులను బెదిరించే రీతిలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంకు చెందిన జగతి సంస్థ అక్రమాలు వెలికితీసినందుకే ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను సస్పెన్షన్‌తో వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అసెస్‌మెంట్‌ బృందంలో ఉండటమే కృష్ణకిషోర్‌ చేసిన నేరమా అని ప్రశ్నించారు. జైలులో జగన్‌తోపాటు ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు ఇచ్చారని, సహ నిందితులుగా ఉన్నవారిని సలహాదారులుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజధాని మార్చే ఉద్దేశం లేదు: బొత్స

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధానిని మార్చే ఉద్దేశం లేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని మార్పుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో మంత్రులు బొత్స, బుగ్గన తదితరులు చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఒకింత గందరగోళానికి తెరతీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర: అసోం సీఎం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ హెచ్చరించారు. భాజపా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రెండు రోజులుగా అసోంలో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధ్వంసం వెనుక కాంగ్రెస్‌ పార్టీ, మత శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. కొందరు వామపక్షవాదుల ప్రమేయం కూడా ఉందని తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోహ్లీసేనకు ఎదురుదెబ్బ: భువికి గాయం!

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ కైవసం చేసుకొని జోరుమీదున్న టీమిండియాకు ఓ ఎదురుదెబ్బ! పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయమైందని సమాచారం. బహుశా అతడు వన్డే సిరీస్‌ ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని జట్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడట. ప్రస్తుతానికైతే జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భువి వెన్ను నొప్పితో బాధపడుతూ మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘పౌరసత్వం’పై ఆగ్రహం.. దిల్లీలో రణరంగం

పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంది. శుక్రవారం దిల్లీతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ వివాదాస్పద చట్టంపై చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్‌ భవనం వద్దకు దాదాపు 2వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ వద్ద విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని విరగ్గొట్టుకుంటూ విద్యార్థులు ముందుకు సాగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గంగా నదిలో పర్యటించనున్న మోదీ

‘నమామి గంగే’ పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయనున్నారు. పవిత్ర గంగా నదిలో ప్రయాణించడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయనున్నారు. శనివారం జరగనున్న నేషనల్‌ గంగా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనటానికి మోదీతో సహా పన్నెండు మంది కేంద్ర మంత్రులు, తొమ్మిది మంది కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలు, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాన్పూర్‌ కు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో తెలుగు ఇంజినీర్‌ ఆత్మహత్య

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్‌ రెడ్డి అక్కడ అమెజాన్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ద్వారకానాథ్‌ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. ఆయన ఆత్మహత్యతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. ద్వారకానాథ్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యుఈ జ్యువెల్లరీ ఎక్స్‌పోను ప్రారంభించిన మోడళ్లు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.