close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. రాజధాని తరలింపును ఆపలేరు: కన్నబాబు

తెదేపా మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సంఖ్యాబలం ఉందని శాసన మండలిలో కుట్రలు చేసి ఇప్పటి వరకు మూడు బిల్లులను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజులు ఆలస్యమైనా రాజధాని తరలింపును ఆపలేరని.. అందులో సందేహం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఓటమిని హుందాగా అంగీకరించాలి: పల్లా

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు కనువిప్పు అవుతాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా బ్యాలెట్‌ పేపర్‌తో జరిగినా తెరాసదే విజయమని అన్నారు. భాజపాకి ఈ ఎన్నికల్లో మతం తప్ప మరో అంశం దొరకలేదని.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయిందంటూ పల్లా ఎద్దేవా చేశారు. ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా అంగీకరించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మండలి రద్దుపై పునరాలోచించాలి: పీడీఎఫ్‌

శాసన మండలి రద్దు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని పీడీఎఫ్‌ తప్పుబట్టింది. శాసన మండలి నిర్వహణతో ఏడాదికి రూ .60కోట్లు వృథా అవుతున్నాయంటూ సీఎం జగన్‌, మంత్రులు శాసనసభలో మాట్లాడటం సరికాదని పీడీఎఫ్‌ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మాత్రం మేథావులు అసెంబ్లీలోనూ ఉన్నారంటూ కించపరచడాన్ని వారు తప్పుబట్టారు. శాసన మండలిలో చర్చలు అర్థవంతంగా సాగుతాయని మంత్రులే చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మేడారం జాతరకు ప్రత్యేక ప్యాకేజీ: శ్రీనివాస్‌ గౌడ్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి శ్రీనివాస్‌ గౌడ్‌ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ చేపడుతున్న పనుల పురోగతిపై హరిత హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మేడారం వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అమ్మల దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అందుకే మోదీ ముఖం వెలిగిపోతుందట!

తన ముఖం ప్రకాశవంతంగా మెరవడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ బయటపెట్టారు. ‘గతంలో కొందరు ఇదే ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా.. కష్టపడి పని చేస్తాను. చెమట చిందిస్తాను. దాంతో ముఖానికి మసాజ్‌ చేసిట్లవుతుంది. అందుకే నా ముఖం వెలిగిపోతుంది’’ అని చెప్పినట్లు మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జాతీయ బాలల అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అవార్డుకు ఎంపికైన 49 మంది చిన్నారులతో ప్రధాని మోదీ దిల్లీలో ప్రత్యేకంగా మాట్లాడారు. వారికి కొన్ని జీవిత పాఠాలను బోధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టోరెంటోలో భారత విద్యార్థినిపై కత్తితో దాడి

కెనడాలో భారత్‌కు చెందిన విద్యార్థినిపై  జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రేచల్‌ ఆల్బర్ట్‌ అనే విద్యార్థినిపై టొరెంటోలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రేచల్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె చావుతో పోరాడుతోందని, అక్కడికి వెళ్లేందుకు వీసా మంజూరు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఘటనపై రేచల్‌ సోదరి రెబెక్కా స్పందిస్తూ.. ఏ జరిగిందనేది తమకు స్పష్టంగా తెలియలేదన్నారు. ఎంతో ఆందోళనతో ఉన్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విధానసభలోకి మిడతలతో వెళ్లిన ఎమ్మెల్యే

చట్టసభల్లో అధికార విపక్ష పార్టీ సభ్యుల వాదోపవాదాలు సహజమే. రాజస్థాన్‌ విధానసభలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేంటంటే.. బికనీర్‌ భాజపా ఎమ్మెల్యే బిహారీలాల్‌  ఓ బుట్ట నిండా మిడతలు తీసుకొని సభకు వచ్చారు. దీంతో సభ మొత్తం ఒక్కసారిగా అతనివైపే తిరిగి చూసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిడతల బెడద ఎక్కువగా ఉందని, వీటివల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఫలితం ఉండటం లేదని అన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకే ఇలా చేశానని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సిరీస్‌కు మంచి కిక్కిచ్చే విజయమిది: కోహ్లీ

న్యూజిలాండ్‌లో దిగిన రెండు రోజులకే విజయం సాధించడం గొప్పగా ఉందని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. మైదానంలో 80 శాతం ప్రేక్షకులు తమకే మద్దతిచ్చినట్టు కనిపించిందని పేర్కొన్నాడు. తొలి టీ20లో కివీస్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘ఈ విజయాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. రెండు రోజుల ముందే ఇక్కడ దిగి ఇలా ఆడామంటే అద్భుతం. ఈ విజయం మొత్తం సిరీస్‌ను నిర్దేశిస్తుంది’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బండరాయితో కొట్టి.. కింద పడేశాడు

హైదరాబాద్‌లోని వారాసిగూడలో ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతోనే విద్యార్థినిని హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఉత్తర మండలం డీసీపీ కమలేశ్వర్ తెలిపారు. డయల్‌ 100 ద్వారా సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించామని డీసీపీ చెప్పారు. మృతురాలి శరీరంపై గాయాలున్నట్లు గర్తించామన్నారు. షోయబ్‌ ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని.. తానే హత్య చేసి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు షోయబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సింహాచలం కొనేరులో అప్పన్న స్వామి తెప్పోత్సవం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.