close

తాజా వార్తలు

Published : 19/07/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. కొవిడ్‌ వ్యాక్సిన్‌.. రేసులో 7 భారత సంస్థలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే వైరస్‌ బాధితుల సంఖ్య 1.4 కోట్లు దాటగా.. మృతుల సంఖ్య 6 లక్షలకు చేరింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌పై ఆశలే మానవజాతిని ముందుకు నడిపిస్తున్నాయి. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగంగా కొనసాగుతున్నాయి. భారత్‌ నుంచి కూడా దాదాపు ఏడు సంస్థలు టీకా అభివృద్ధిలో తలమునకలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మోదీ@6 కోట్ల‌ ఫాలోవర్లు

సామాజిక మాధ్యమాల్లో అత్యధికమంది అనుసరించే ప్రపంచ నాయకుల్లో ప్రధాని నరేంద్ర  మోదీ ఒకరు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉంటారు. అందుకు తగ్గట్టు ఆయనకున్న ఆదరణ పెరుగుతూనే ఉంది. ట్విటర్‌లో తనను అనుసరించే వారి విషయంలో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన మోదీ తాజాగా మరో మైలురాయి చేరుకున్నారు. ఆదివారం ట్విటర్‌లో మోదీని అనుసరించేవారి సంఖ్య 60 మిలియన్లను దాటడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో కరోనా: 50 వేలకు చేరువగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే ఐదువేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఇవాళ కొత్తగా 5,041 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు 642 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పాత్రికేయులకు లోకేశ్ బీమా ధీమా

కరోనా వేళ మంగళగిరి నియోజకవర్గం పాత్రికేయులకు తెదేపా నేత నారా లోకేశ్ బీమా ధీమా కల్పించారు. మంగళగిరి పరిధిలోని 62 మంది పాత్రికేయులకు లోకేశ్‌ బీమా చేయించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20లక్షలు, కొవిడ్‌ మరణాలకూ బీమా వర్తింపజేసేలా ప్రీమియం చెల్లించినట్లు లోకేశ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని లోకేశ్‌ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొవిడ్‌ ప్రపంచం: ఒక్కరోజే 2,60,000 కేసులు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ తీవ్రత యూరప్‌ దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలో రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం రికార్డుస్థాయి కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,59,848 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకు ముందురోజు కూడా 2,37,743 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఐపీఎల్‌ కోసం సాధన మొదలెట్టిన క్రికెటర్లు

ఐపీఎల్‌ కోసం టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్లు సాధన మొదలెట్టారు. ప్రముఖ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా, పేసర్‌ మహ్మద్‌ షమి, లెగ్‌స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచీ ఆటకు దూరమైన ఆటగాళ్లు ఈమధ్యే మైదానాల బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముగ్గురు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కరోనా తర్వాత ఆహార భద్రత ముఖ్యం

కరోనా వైరస్  తర్వాత ప్రజలకు ఆహార భద్రత కల్పించడం అత్యంత ముఖ్యమైన పని అని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో ఆహార వ్యవస్థను బలోపేతం చేసి.. భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనేట్లు తీర్చిదిద్దడం కీలకమని పేర్కొన్నారు.  ఆహార వ్యవస్థ మనుషులు, పశువులు, ఆర్థిక, పర్యావరణానికి అత్యంత కీలకమైంది. ‘మనం ఆర్థిక వ్యవస్థలు ఆహారానికి ప్రధాన్యం ఇస్తూనే సంస్కరణలను చేపట్టాలి’ అని ఐఎంఎఫ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నల్గొండ ఘటన: హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు

నల్గొండ జిల్లాలో కరోనా మరణం ఘటనను మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించినట్లు హెచ్‌ఆర్‌సీ తెలిపింది. ఆగస్టు 21లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్గొండ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలు ఉన్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి

అఫ్గనిస్థాన్‌ సిక్కు నాయకుడు నిదాన్‌సింగ్‌ సచ్‌దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో  పాక్తియా ప్రోవిన్స్‌లో సచ్‌దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఆఫ్గన్‌ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన పెద్దలకు మా అభినందనలు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. ఓ ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంటూ ఉగ్రవాదులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని హింసించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కారులో 1,248 మద్యం సీసాలు పట్టివేత

ఆంధ్రప్రదేశ్‌లోకి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులు భారీగా పట్టుకుంటున్నా మందుబాబులు మాత్రం వెనుకంజ వేయడంలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా కారులో భారీ సంఖ్యలో మద్యం సీసాలు దొరికాయి. తెలంగాణ నుంచి మాదిపాడు వైపు కారులో 1,248 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.