close

తాజా వార్తలు

Published : 29/07/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. అన్‌లాక్‌ 3.0: జిమ్‌లకు ఓకే.. హాళ్లకు నో!

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. 3 నుంచి 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు. విద్యాహక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో కరోనా: ఒక్కరోజులో 10వేల కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (9am-9am) 70,584  నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఇవాళ కొవిడ్‌-19 నుంచి 2,784 మంది కోలుకోగా.. మొత్తం 55,406 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మహిళల సాధికారతకు రెండు పథకాలు: జగన్‌

క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు రాష్ట్రానికి సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. మహిళల సాధికారతకు ఆగస్టు, సెప్టెంబరులో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళకు సాయం అందిస్తామని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

కోఠి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. మొబైల్‌ ల్యాబ్‌లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు లేనివారికి ఇంట్లోనే ఐసోలేషన్‌ ఉంటుందని, అక్కడ సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామన్నారు. 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మూడేళ్లలో 44 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు

రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సంఖ్య పెంపు దిశగా ఆ శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో అంటే 2022 నాటికి వీటి సంఖ్య 44కి పెంచనున్నట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైళ్లను చైన్నై, రాయ్‌బరేలి, కపుర్తలలో ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీలతో వీటిని తయారు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. నేటి నుంచి మార్కెట్‌లోకి కరోనా ఔషధం

కొవిడ్‌-19 వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. రెమిడెవిసిర్‌కు జనరిక్‌ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనా వైరస్‌ వ్యాధి ప్రాధమిక, మధ్యస్థ దశలో ఉన్నపుడు వాడతారు. తాజా ఔషధం ఫావివిర్‌ నోటి ద్వారా తీసుకునే మాత్రల రూపంలో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు, ఫార్మసీల్లో లభ్యమవుతుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అనిశాకు ఆధారాలు సమర్పించిన శ్రీసుధ

ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ మురళీకృష్ణపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీసుధ బుధవారం అవినీతి నిరోధక శాఖ (అనిశా) కార్యాలయానికి వచ్చి ఆధారాలను సమర్పించారు. సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు సోదరుడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ మురళీకృష్ణ రూ. 5 లక్షలు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మోసగాళ్లని పట్టుకునే లేడీ డిటెక్టివ్‌లు

సాధారణంగా మన సినిమాలు పాకిస్థాన్‌లో విడుదలవుతుంటాయి. కానీ త్వరలో ఓ పాకిస్థాన్‌ వెబ్‌సిరీస్‌ భారత ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన జిందగీ ఛానెల్‌లో ఎక్కువగా పాకిస్థాన్‌కు చెందిన సీరియళ్లు.. వెబ్‌సిరీస్‌లు ప్రసారమవుతుంటాయి. అయితే తాజాగా జిందగీ.. పాకిస్థాన్‌లో ‘చురైల్స్‌’అనే వెబ్‌సిరీస్‌ను తీసింది. ఆగస్టు 11న భారత్‌లో జీ5 వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. క్యూ1లో మారుతీ నష్టం రూ.249 కోట్లు

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌.. కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాటి తయారీ కంపెనీల ఆదాయాలు భారీగా పడిపోయాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి రూ.249 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ కంపెనీ రూ.1435.5 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.