close

తాజా వార్తలు

Published : 30/07/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ‘‘తెలుగు’ పాఠశాలలనూ ఏర్పాటు చేస్తున్నాం’

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ విద్యకు కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానంపై మంత్రి సురేశ్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ముసాయిదాలోని పలు అంశాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తాం, రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతోపాటు తెలుగు మాధ్యమ పాఠశాలలనూ ఏర్పాటు చేస్తున్నామని సురేశ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గహ్లోత్‌కు కొత్త చిక్కు..ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో విలీనం అయిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు స్పీకర్‌ సీపీ జోషి, అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విలీనంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రోదసిలోకి నాసా పెర్సీవరెన్స్‌ రోవర్‌

అగ్రరాజ్యం అమెరికా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగానికి మరో ముందడుగు పడింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పర్సీవరెన్స్‌ రోవర్‌ను రోదసికి పంపింది. ఈ రోవర్‌ అంతరిక్షంలో ఏడు నెలలు ప్రయాణించి అంగారక గ్రహంపై దిగనుంది. ఆ గ్రహంపై ‘మార్స్‌ సంవత్సరం’ పాటు జీవజాలంపై పరిశోధన చేయనుంది. ఇందుకోసం నాసా అంగారకుడిపై జీవం ఉన్న ప్రాంతంలో రోవర్‌ను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీ కరోనా: వరుసగా రెండో రోజు 10వేలు+

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో(9am-9am) రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,441 కేసులు, కర్నూలు జిల్లాలో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 69,252ఉండగా.. 60,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అనవసరంగా మొట్టికాయలు తింటున్నారు: సుజనా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని తరలింపులో కేంద్రానికి పాత్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పాత్ర ఉందనే రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. ఏపీ పరిస్థితులపై సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎస్‌ఈసీ కేసులో ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తోందని చెప్పారు. అనవసరంగా కోర్టుతో మొట్టికాయలు తింటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ 30శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికే ఇది వర్తించనుంది. హైదరాబాద్‌లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్‌ఆర్‌ఏ వెసులుబాటు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మూడు లక్షల ఉద్యోగాలిస్తాం: సోనూ సూద్‌

వలస కార్మికులకు ఆపన్నహస్తంగా నిలుస్తున్న ప్రముఖ నటుడు సోనూ సూద్‌... వ్యక్తిగతంగా తన పరిశీలనకు వచ్చిన వారికీ ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం నడుం బిగించిన ఆయన, నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. దేశంలో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ సాధ్యం కాదు!

అధిక జనాభా కలిగిన దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్‌ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈవైరస్‌ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మానవ అక్రమ రవాణా నిరోధానికి స్పెషల్‌ టీమ్‌

తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధానికి రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘జూనియర్‌ పాండ్యకు’ హార్దిక స్వాగతం..

టీమ్‌ ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య గురువారం మధ్యాహ్నం తండ్రయ్యానని చెప్పగానే టీమ్‌ఇండియా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐతో పాటు తోటి ఆటగాళ్లు, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ అందరూ పాండ్య, నటాషాలకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. జూనియర్‌ పాండ్యకు స్వాగతం పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది తొలి రోజే హార్దిక్‌ తన ప్రేయసికి ప్రపోజ్‌ చేసి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.