close

తాజా వార్తలు

Published : 02/08/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ‘చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి’

అమరావతి రైతుల కోసం తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలన్నారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది  ఈ వైరస్‌ బారినపడ్డారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

రామమందిరం భూమిపూజను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అయోధ్యలో భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ రామమందిరం భూమిపూజలో పాల్గొననున్న నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, అనేకమంది ప్రముఖులు సైతం హాజరవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కొత్తగా 8,555 కేసులు.. మరో 67 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా 8,555 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 1,474 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,404 మంది చికిత్స పొందుతుండగా.. 82,886 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలి

రాజకీయ నాయకుల్ని చట్టవిరుద్ధంగా బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 370 అధికరణం రద్దు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కశ్మీర్‌లో నేతల్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. దాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ గృహనిర్బంధంలోనే ఉన్న పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. వందేభారత్‌ మిషన్‌: 9లక్షల మంది స్వదేశానికి..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో విమానయానం మూగబోయింది. చాలా దేశాల్లో విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే విదేశీ విమానాలను అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు మూడు నెలల క్రితం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్’‌ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. దీనిద్వారా ఇప్పటివరకు దాదాపు 9లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు భారత పౌరవిమానయానశాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు..

విశాఖపట్నంలోని విమ్స్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఓ మహిళ మంచంపైనుంచి కింద పడినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదని కరోనా వార్డుల్లోని ఇతర రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య పరికరాలు ఉన్నా వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే నాథుడే లేరంటూ ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తమిళనాడులో అల్లర్లు: ఇళ్లు, వాహనాలకు నిప్పు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య  తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణలతో సంబంధం ఉన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కరోనాను జయించిన అమితాబ్‌ ‌.. కానీ

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కరోనాను జయించారు. 77ఏళ్ల వయసులోనూ ధైర్యంతో కరోనాపై పోరాడి విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే, తాను మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోలేదని ఇంకొంత సమయం ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘కదలకుండా 2 గంటలు’: పాపులరైన యువకుడు

సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఒకటి. ఎంతో మంది ఇందులో పాపులర్‌ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలు పడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు మాత్రం ఏం చేయకుండా కేవలం కెమెరా ముందు కూర్చొని బాగా పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు అక్కడి సోషల్‌మీడియాలో ఆ యువకుడి వీడియోలు, మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అతడిలా వీడియోలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.