close

తాజా వార్తలు

Published : 04/08/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ఇదిగో రామమందిరం..

మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల హెచ్చరిక

అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్ని మళ్లీ మళ్లీ కోరుతున్నాం. జ్వరమే కదా.. దగ్గే కదా.. జలుబే కదా.. ఏమైతదిని మీ ఇళ్లలోనే మీరు ఉండొద్దు. కరోనా చికిత్స విషయంలో పద్ధతి మారకపోతే  ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు రద్దు చేస్తాం’’ అని ఈటల అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘అసెంబ్లీ రద్దు సవాల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లండి’

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రద్దు సవాల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. 175 నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. అసెంబ్లీని రద్దుపై చంద్రబాబు విసిరిన సవాల్‌పై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలపై దాడులు-దౌర్జన్యాలు, హత్యలు-అత్యాచారాలపై నాయకులు ధ్వజమెత్తాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కరోనా: 9,747 కేసులు.. 67 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,147 నమూనాలను పరీక్షించగా 9,747 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 79,104 మంది చికిత్స పొందుతుండగా.. 95,625 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మరో 67 మంది మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకు 1,604 మంది ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొవాగ్జిన్‌ తొలి దశ ట్రయల్స్‌ పూర్తి:ICMR

భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా తొలి దశ ట్రయల్స్‌ పూర్తయిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌తో పాటు జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ కూడా తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నట్టు ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. రెండో దశ ట్రయల్స్‌కు ఇరు సంస్థల వ్యాక్సిన్లు సిద్ధమైనట్టు చెప్పారు. రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వైరస్‌ బారిన పడగా, తాజాగా కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు హరియాణాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బీసీసీఐకి తలనొప్పి! తెగదెంపులకు సిద్ధమైన వివో?

బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి! ఐపీఎల్‌-2020పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. టైటిల్‌ స్పాన్సర్‌ ‘వివో ఇండియా’ బోర్డుతో తెగదెంపులు చేసుకొనేందుకు సిద్ధమైందని సమాచారం. వీలైతే పూర్తి కాలానికి లేదా కనీసం ఈ సీజన్‌కైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఫలితంగా బోర్డుకు ఏం చేయాలో? సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సన్‌ఫార్మా ఫావిపిరవిర్‌.. ఒక్కో ట్యాబ్లెట్‌ ₹35

కొవిడ్‌-19 నుంచి ఉపశమనం కలిగించే యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ను ముంబయి కేంద్రంగా పనిచేసే సన్‌ఫార్మా సంస్థ దేశీయంగా ఫ్లూగార్డ్‌ పేరిట మంగళవారం విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను రూ.35గా నిర్ణయించింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి కొవిడ్‌-19 చికిత్సలో ఈ మాత్రలను వాడుతున్నారు. ఈ వారం నుంచే ఈ మాత్రలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సన్‌ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అదే భారత్‌కు ఇప్పుడు పెద్ద సమస్య:ట్రంప్‌

ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోల్చుకుంటే కరోనా వైరస్‌ మీద అమెరికా బాగా పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ వైరస్‌ భారత్‌కు అతి పెద్ద సమస్యగా పరిణమించిందని, చైనాలో మరోసారి ఆకస్మికంగా కేసులు బయటపడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పాక్‌ వక్రబుద్ధి.. మన భూభాగాలతో కొత్త మ్యాప్‌

పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న ఆ దేశం.. ఇప్పుడు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పటి వరకు పీవోకే తమదేనని చెప్పుకొంటూ వస్తున్న పాక్‌.. తాజాగా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని తమ భూభాగాలుగా చూపిస్తూ కొత్త రాజకీయ చిత్రపటాన్ని మంగళవారం విడుదల చేసింది. గుజరాత్‌లోని జునాగఢ్‌‌, మన్వదార్‌, సర్ క్రీక్‌లను కూడా ఆ మ్యాప్‌లో చూపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.