close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. రాజధానిపై చర్చ జరగాలి: బొత్స

రాజధానిని అమరావతిలోనే కొనసాగించడంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సందిగ్ధంలో పడేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని, కమిటీ నిర్ణయం వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శాసనమండలిలో కేవలం సభ్యుల ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సుప్రీంకోర్టులో అసదుద్దీన్‌ పిటిషన్‌

పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరుతూ శనివారం ఓ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. 6 ఏళ్లలో మోదీ చేసింది అదొక్కటే: మన్మోహన్‌

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని యువత, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక్కటే చేశారని ఎద్దేవా చేశారు. ‘భారత్‌ బచావో’ ర్యాలీలో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని మెరుగుపరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 22 ఏళ్లకే ఐపీఎస్‌ అధికారి..!

దేశంలోనే అత్యంత యువ ఐపీఎస్‌ అధికారిగా ఓ యువకుడు రికార్డు సృష్టించబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పాలంపూర్‌ పట్టణం కనోదర్‌ గ్రామానికి చెందిన హసన్ సఫిన్‌.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 570 ర్యాంకు సాధించారు. అనంతరం అతడు ఐపీఎస్‌ అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్‌ డిసెంబర్‌ 23న జామ్‌నగర్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు

బంగాల్‌లోని లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పౌరసత్వ సవరణచట్టాన్ని వ్యతిరేకిస్తూ బంగాల్‌లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హౌరా లోని సంక్రాలి రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టగా అక్కడ ఉన్న పలు దుకాణాలు తగలబడ్డాయి. అనంతరం టికెట్‌ కౌంటర్‌ను తగులబెట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆర్పీఎఫ్‌, రైల్వే సిబ్బందిపై దాడి చేసి గాయపరిచినట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రముఖ కళాకారిణి లీలా శాంసన్‌పై సీబీఐ కేసు

ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్‌ లీలా శాంసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన కూతుంబలం ఆడిటోరియం పునరుద్ధరణ పనుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లీలా శాంసన్‌తో పాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శనివారం వెల్లడించారు. లీలా శాంసన్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాకుండా ఆమె సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ట్రైనీ ఐపీఎస్‌ సస్పెన్షన్‌

ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డిని కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జవహర్‌నగర్‌ పోలీసులు... గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా అవకాశం కల్పిస్తామని హోంశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం

ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్‌ లేన్స్‌ను తాత్కాలికంగా హైబ్రిడ్‌ లేన్స్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ఆందోళన

విద్యుత్‌ ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల యాజమాన్య ప్రతినిధుల సమావేశం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరిగింది. టీఎస్‌పీఈఏ అద్యక్షులు పి.రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పి.సదానందంలతో పాటు ఇతర ఇంజినీర్లు ధర్మాధికారిని కలిసి స్థానికత ఆధారంగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 2022 నాటికి పార్లమెంట్‌ నూతన భవనం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.