close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. మండలిలో నెగ్గిన తెదేపా పంతం!

ఏపీ శాసన మండలిలో తెదేపా పంతం నెగ్గింది. రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. రూల్‌ 71పై చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లులను పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 71పై చర్చ ప్రారంభించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. టెండర్‌ ఓటు పడితే.. రీపోలింగ్‌: నాగిరెడ్డి

పురపాలిక ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించేందుకు  అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులతోపాటు వివిధ పార్టీల నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. అభ్యర్థుల గత చరిత్ర, ఆస్తులు, నేర చరిత్ర వివరాలను అందుబాటులో ఉంచుతామని నాగిరెడ్డి తెలిపారు. ఆ వివరాల ఆధారంగా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవచ్చని వివరించారు. టెండర్‌ ఓట్లు పడిన ప్రాంతాల్లో కచ్చితంగా రీపోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘జగనన్న గోరుముద్ద’గా మధ్యాహ్న భోజనం!

విద్యార్థులకు మనం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి చదువేనని.. నాణ్యమైన విద్య అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేపడుతున్న కార్యక్రమమే అమ్మఒడి అని ఆయన చెప్పారు.  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు.  రోజూ ఒకే రకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేశామన్నారు. ఈ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం చేసినట్లు జగన్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పిచ్చికుక్కల దాడి: 50మందికి గాయాలు

నగరంలోని అమీర్‌పేట్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో సుమారు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ధరమ్‌కరమ్‌ రోడ్డులో చోటు చేసుకుంది. కుక్కలు ఒక్కసారిగా విద్యార్థులపైకి దూసుకుని రావడంతో వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో పిచ్చికుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలపాలైన విద్యార్థులను నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రితో పాటు నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌లో పెట్టుబడులు పెరగాలి: గీతా గోపీనాథ్‌

భారత్‌లో పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ఛీప్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా మార్కెట్‌ వర్గాల్ని ప్రోత్సహించాలని సూచించారు. దేశీయ పెట్టుబడుల్ని పునరుత్తేజపరచాలని అభిప్రాయపడ్డారు. ప్రజల వినిమయ శక్తి బాగా బలహీనపడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుల్ని మరింత పెంచి.. తద్వారా భారత వృద్ధి రేటును గాడిన పెట్టాలన్నారు. పెట్టుబడులపై ఇటీవల అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్య జరిగిన వ్యాఖ్యల నేపథ్యం మార్కెట్‌ సెంటిమెంటుపై ప్రభావం చూపిందా అన్న ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రైతుభరోసా కేంద్రాల్లోనే విత్తనాల విక్రయం

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతుభరోసా కేంద్రాలు పని చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 11,158 రైతు భరోసా కేంద్రాల్లో విత్తన, మృత్తిక పరీక్ష ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో ప్రతి ఒక్క రైతూ భూసార పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు రావడానికి అవకాశముంటుందని చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే విత్తనాలను విక్రయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సోమిరెడ్డిపై క్రిమినల్‌ కేసు కొట్టివేత

తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నమోదైన క్రిమినల్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అనంతరం ఇడిమేపల్లి భూముల విషయంలో సోమిరెడ్డిపై ఫోర్జరీతోపాటు పలు సెక్షన్ల కింద నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో నాలుగున్నర గంటల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. దీంతో తన భూములకు సంబంధించి 1933 నుంచి ఉన్న డాక్యుమెంట్లను సోమిరెడ్డి  పోలీసులకు చూపడంతో పాటు మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వేలానికి నీరవ్‌ మోదీ వాచీలు, బ్యాగ్‌లు

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీకి చెందిన లగ్జరీ వస్తువులను త్వరలో వేలానికి పెట్టనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకున్న నీరవ్‌ వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, కళాఖండాలను వేలం వేయనున్నారు. ఈడీ తరఫున ముంబయికి చెందిన శాఫ్రాన్‌ఆర్ట్‌ ఈ వేలం నిర్వహించనుంది. మొదట ఫిబ్రవరి 27న ప్రత్యక్ష వేలం జరగనుంది. ఆ తర్వాత మార్చి 3-4 మధ్య ఆన్‌లైన్‌ వేలం నిర్వహించనున్నట్లు శాఫ్రాన్‌ఆర్ట్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కృష్ణా నదికి నీటి మళ్లింపుపై దిల్లీలో చర్చ

తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు దిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల  ఛైర్మన్లు, కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ హాజరయ్యారు. సమావేశానికి ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు  సహా ఇతర జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి నదీ యాజమన్య బోర్డుల పరిధి, నిధుల విడుదలపై చర్చించారు. గోదావరి నుంచి కృష్ణానదికి మళ్లించే నీటిలో తెలంగాణ వాటా సహా, కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపుపైనా భేటీలో చర్చ సాగింది.

10. దావోస్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్‌ భేటీ



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.