close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. జేడీయూ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌కు ఉద్వాసన

జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ఆయనను జేడీయూ నుంచి బహిష్కరించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మపై కూడా బహిష్కరణ వేటు వేసింది. వీరిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జేడీయూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వీరిద్దరూ పార్టీ నిర్ణయాలకు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే క్రమశిక్షణా చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జేడీయూ చీఫ్‌ జనరల్‌ సెక్రటరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆరు రోజుల్లో రాజధాని నిర్ణయిస్తారా?:బొండా

తాడేపల్లిలో సిద్ధమైన పత్రాలపై జీఎన్‌రావు కమిటీ సంతకాలు చేసిందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 10 జిల్లాలను కేవలం 6 రోజుల్లోనే కమిటీ పర్యటించిందన్నారు. ఆరు రోజుల్లో రాష్ట్ర రాజధానిని కమిటీ ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఎవరినీ అడక్కుండానే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు వేశారని బొండా ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కరోనాకు మందు సూచించిన ఆయుష్‌..

ప్రపంచమంతా కరోనా వైరస్‌ భయంతో వణికిపోతున్న నేపధ్యంలో ఆ వ్యాధి రాకుండా నిరోధించేందుకు వాడవలసిన ఔషధం, పాటించవలసిన జాగ్రత్తలను గురించి భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. హోమియోపతి ద్వారా కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కోనే విధానాలను గురించి చర్చించేందుకు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి సలహా మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా హోమియోపతి మందు ‘ఆర్సెనికం ఆల్బమ్‌ 30’ ను ఖాళీ కడుపుతో మూడు రోజుల పాటు తీసుకోవటం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. వైఎస్‌ కాంగ్రెస్‌ మనిషే: శైలజానాథ్‌

ఓ ఆలోచన అంటూ లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేసి పాలిస్తున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోందన్నారు.  వైఎస్‌ వ్యక్తిగతంగా జగన్ కుటుంబంలోని వ్యక్తి కావొచ్చని.. కానీ ఆయన కాంగ్రెస్ మనిషే అని గుర్తుంచుకోవాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఐఐటీ ముంబయి విద్యార్థులకు మార్గదర్శకాలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐఐటీ ముంబయి వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు విద్యార్థి వ్యవహారాల డీన్‌, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెయిల్ ద్వారా మార్గదర్శకాలతో కూడిన లేఖను పంపారు. అందులో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు దేశ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకూడదని కోరారు. నిబంధనలకు విరుద్దంగా వ్వవహరించిన విద్యార్థులను వసతి గృహాల నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. బంగ్లా అదుపులోని ఏపీ మత్స్యకారులు విడుదల

చేపలవేట కోసం వెళ్లి బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లో చిక్కుకుని బందీలుగా ఉండిపోయిన ఎనిమిది మంది ఏపీ మత్స్యకారులు విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులను బంగ్లాదేశ్‌ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 27న బోటులో చేపలవేటకు వెళ్లిన వీరంతా పొరపాటున బంగ్లాదేశ్‌ భూభాగంలోకి ప్రవేశించారు. అక్టోబర్‌ 2న ఆ దేశ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. జగన్‌పై సోదరికే నమ్మకం లేదు:చింతమనేని

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు. తనకు నచ్చనివన్నీ సీఎం రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏలూరులోని తెదేపా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజులను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. జగన్‌పై సోదరికే నమ్మకం లేకపోతే.. ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని చింతమనేని ప్రభాకర్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్లాస్టిక్‌తో రోడ్లు వేస్తామంటోన్న రిలయన్స్‌

ప్లాస్టిక్‌ వాడకంతో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త ప్రాజెక్ట్‌ చేపట్టింది ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. రహదారుల నిర్మాణంలో వృథా ప్లాస్టిక్‌ను వినియోగించేలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ సరికొత్త టెక్నాలజీతో జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాను సంప్రదించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇప్పటికే రోడ్ల నిర్మాణంలో కంపెనీ ప్లాస్టిక్‌ను వినియోగించింది. రాయ్‌గఢ్‌లోని రిలయన్స్‌ నాగోఠణే మానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ వద్ద దాదాపు 40 కిలోమీటర్ల ‘ప్లాస్టిక్‌ రోడ్‌’ను నిర్మించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. 5 కెమెరాలతో మార్కెట్లోకి గెలాక్సీ ఏ51

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్  ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ51ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఏ50కి కొనసాగింపుగా మిలినియల్స్ కోసం సరికొత్త ఫీచర్స్‌తో ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 31 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద అమెజాన్‌ పే తో ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. దానితోపాటు ఒకసారి ఉచిత స్ర్కీన్‌ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. దిల్లీలో ఘనంగా బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమంTags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.