close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ‘ఫసల్‌ బీమా’ ఇక ఐచ్ఛికం.. కేబినెట్‌ నిర్ణయం

రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంలో చేరడం తప్పనిసరి. తాజాగా ఇందులో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫసల్‌ బీమా ఐచ్ఛికమేనని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివరించారు. 2016 ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, రుణాలు తీసుకునేవారు తప్పనిసరిగా ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీకి నాబార్డు రుణం మంజూరు

ఏపీకి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ఈ రుణాన్ని ఇవ్వనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ కింద ఈ రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు నాబార్డు ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని వినియోగించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవారి భక్తులకు ఇకపై ‘వడ’ ప్రసాదం

తిరుమలలో శ్రీవారి ప్రసాదాలను తితిదే సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన కల్యాణం లడ్డూను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన తితిదే రేపటి నుంచి వడ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రభుత్వ విద్యుత్‌ప్లాంట్‌పై దృష్టిపెట్టండి:జగన్‌

నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్మేందుకు ఎవరైనా ముందుకొస్తే వారితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల డిస్కంలపై భారం తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంట్‌పై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసల్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి మే 27 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దివ్య హత్య:లొంగిపోయిన ప్రేమోన్మాది

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యకేసు ప్రధాన నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ బుధవారం సాయంత్రం వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్‌ పోలీసులకు అప్పగించినట్లు వేములవాడ పట్టణ సీఐ శ్రీధర్‌ తెలిపారు. అంతకుముందు సిద్దిపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెంకటేశ్‌గౌడ్‌ స్వస్థలమైన వేములవాడలోని అతని స్వగృహం, కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్పైస్‌జెట్‌ నుంచి మరో 20 విమానాలు

తక్కువ ధరల్లో విమానప్రయాణం అందించే విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నుంచి  మరో 20  విమానాలు రానున్నాయి. మార్చి 29 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నట్టు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. కొత్త విమానాలు గౌహాతీ-పట్నా, హైదరాబాద్‌-మంగుళూరు, బెంగళూరు-జబల్‌పూర్‌, పట్నా-వారణాశి, ముంబాయి- ఔరంగబాద్‌ల మధ్య సర్వీసు నడపనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో దేశీయంగా 12 నగరాలను కలుపుతూ 52 విమానాలను వినియోగంలోకి వస్తాయని స్పైస్‌జెట్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అక్రమ ‘ఆధార్’ కార్డుదారులపై చర్యలు..

అక్రమ ఆధార్‌కార్డుదారులపై కొరడా ఝుళిపించే కార్యక్రమం మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమవలసదారులు పొందిన ఆధార్ కార్డుల ఏరివేతపై అధికారులు దృష్టి సారించారు. పోలీసుల నివేదిక ఆధారంగా హైదరాబాద్ ఆధార్ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 127 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత తనిఖీ ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవాసులకు అధికారులు ఆధార్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెదేపా తరహాలోనే వైకాపా పాలన: భాజపా

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఫ్యాక్షన్‌, రాజకీయ చరిత్రను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా గూండాలు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. గతంలో తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగించిన తరహాలోనే వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్‌ గెలాక్సీ A71

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ మరో మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతేడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఏ70కి కొనసాగింపుగా ఏ71ని విడుదల చేసింది. 64ఎంపీ కెమెరా, 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో భారతీయుల కోసం కొన్ని ఫీచర్లను అదనంగా జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.