close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. దిల్లీ ఘర్షణల దర్యాప్తుకు సిట్‌ బృందాల ఏర్పాటు

దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన దిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో బృందానికి నేర విభాగం అదనపు సీపీ బీకే సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. ఆ కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కర్నూలు హత్యాచారం కేసు సీబీఐకి అప్పగింత

కర్నూలులో బాలిక హత్యాచారం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2017లో కర్నూలుకు చెందిన పదోతరగతి విద్యార్థినిని దుండగులు అత్యాచారం, హత్య చేశారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కర్నూలు వెళ్లి బాలిక హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

విశాఖ నుంచి బయల్దేరిన చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ నుంచి బయల్దేరారు. శాంతిభద్రతల దృష్ట్యా హైదరాబాద్‌ వెళ్లాలని పోలీసులు సూచించడంతో విశాఖ నుంచి ఆయన తిరుగుపయనమయ్యారు. చంద్రబాబు బయల్దేరడంతో తెదేపా నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఈ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సీఏఏపై వెనకడుగు వేయం: కేంద్రమంత్రి

గతేడాది పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తేల్చిచెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గురువారం ఆదాయపుపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రవిశంకర్‌.. మతపరమైన హింసకు గురై పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌ల నుంచి వచ్చే వాళ్లకు భారత పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొత్త జిల్లాల్లోనూ కేవీకేలు ఏర్పాటు చేయండి

రాష్ట్రంలో కందులకు కేంద్రం క్వింటాల్‌కు రూ.5,800 మద్దతు ధర ప్రకటించిందని, కానీ  మార్కెట్లో రూ. 4,600 మించి అమ్ముడుపోవడం లేదని తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మద్దతు ధరతో కొనుగోలుకు కేంద్రం 47,500 మెట్రిక్‌ టన్నులకు అనుమతిచ్చిందని చెప్పారు.  దిల్లీలో నిర్వహించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 91వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ కేవీకేలను ఏర్పాటు చేయాలని సమావేశంలో కోరామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రాజధాని మార్చాలంటే అసెంబ్లీ రద్దు చేయండి

రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. కన్న తండ్రిలా పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కసాయి తండ్రిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానిని మార్చాలను కోవడాన్ని ఓ చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన ఘటనపై కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఓ ఇంటర్‌ విద్యార్థిని కళాశాల క్యాంపస్‌లో ఆత్మహత్యకు పాల్పడగా ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘ నాయకులు బుధవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థి మృతదేహం వద్ద ఆమె తండ్రి విలపిస్తుండగా కానిస్టేబుల్‌ శ్రీధర్‌ బూటు కాలితో తన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఎవరినీ వదలొద్దు: కేజ్రీవాల్‌

ఈశాన్య దిల్లీలో అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలొద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ ఘటనల్లో తమ పార్టీకి చెందిన వారి జోక్యం ఉందని రుజువైతే వారిపై రెట్టింపు చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లర్లు, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఈ అల్లర్లు జరిగిన ప్రాంతంలో సర్వం కోల్పోయిన వారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అల్లర్లపై రాజకీయం చేస్తున్నారు: భాజపా ఫైర్‌

హింసాత్మక ఘటనల్ని కాంగ్రెస్‌, ఆప్‌ రాజకీయం చేస్తున్నాయని భాజపా దుయ్యబట్టింది. హెడ్‌ కానిస్టేబుల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ మృతిపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ శాంతి కోసం ప్రయత్నించేందుకు పనిచేయాలన్నారు. గత రెండు మాసాల క్రితం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ర్యాలీ నిర్వహించినప్పటి నుంచి హింసను ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లోకి ఒప్పో ఏ31(2020)

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మరో బడ్జెట్‌ మొబైల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఒప్పో ఏ31(2020) మొబైల్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. 2015లో ఈ సంస్థ నుంచి విడుదలైన ఏ31కు అనేక మార్పులు జోడించి ఏ31(2020)ను తయారుచేశారు. దీనికి ట్రిపుల్‌ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనున్న ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.11,490గా సంస్థ నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.