close

తాజా వార్తలు

Published : 02/07/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. రష్యా నుంచి 33 యుద్ధ విమానాలొస్తున్నాయ్‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. యుద్ధ విమానాల్లో సుఖోయ్‌ ఎస్‌యూ -30 ఎంకేఐ ఫైటర్లు 12, మిగ్‌ -29 ఫైటర్లు 21 ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్‌-29 యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తంవిలువ రూ. 18148 కోట్లుగా స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. భారీ సంస్కరణ: 65+ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్‌-నవంబర్‌లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. దుబాయ్‌ లేదా శ్రీలంకలో ఐపీఎల్‌ 2020!

ఐపీఎల్‌ 2020 ఎడిషన్‌ విదేశాల్లో నిర్వహించడం ఖాయమే అని తెలుస్తోంది. వేదికగా దుబాయ్‌ లేదా శ్రీలంకను ఎంపిక చేసే అవకాశముంది. టీ20 ప్రపంచకప్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువడితే ఈ విషయాన్ని ఐపీఎల్‌ పాలకవర్గం ప్రకటించనుందని బీసీసీఐలోని ఓ అధికారి అంటున్నారు. వీలైనంత వరకు భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోతే యూఏఈ లేదా శ్రీలంకకు టోర్నీని తరలించక తప్పదని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీ ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవిలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.రమేశ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీచేశారు. పి.రమేశ్‌కుమార్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. అలాగే, సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావును నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌తో బంధం చాలా అవసరం: బిడెన్‌

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌తో భాగస్వామ్యం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, అమెరికా సహజ భాగస్వామి అయిన భారత్‌తో సంబంధాల బలోపేతానికి తన పాలనలో అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నష్టం లేకుంటేనే వివోతో ఐపీఎల్‌ ఒప్పందం రద్దు!

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందంలో ‘ఎగ్జిట్‌ క్లాజ్‌’ వివోకు అనుకూలంగా ఉంటే సదరు సంస్థతో తెగదెంపులకు అవకాశం తక్కువేనని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. ఈ విషయంపై ఐపీఎల్‌ పాలక మండలి సమీక్ష ఎప్పుడు ఉంటుందో ఆయన చెప్పలేదు. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అప్పుడంతా భావోద్వేగం చెందడంతో చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌లను రద్దు చేసుకోవాలని బీసీసీఐని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కోర్టుల నుంచే ప్రభుత్వం నడిపిస్తారా?

ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుల తీరును ఆయన తప్పుబట్టారు. అలాగే, ఏపీలో ద్రవ్య బిల్లును ఆమోదం పొందడానికి ఆపి.. ఉద్యోగుల జీతాలను అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను నడిపిస్తారా అని తమ్మినేని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కరోనా నుంచి కోలుకున్న వారెందరంటే!

కరోనా బారిన పడుతున్న వారితో పోలిస్తే, కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారితో పోలిస్తే, కోలుకుంటున్న వారు 1.32లక్షల మంది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రోజూ సగటున 10వేలమందికి పైగా కరోనా నుంచి కోలుకుంటున్నారని కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. తమిళనాట లక్షకు చేరువలో కరోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి 4343 కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 98,392కి పెరగ్గా.. మరణాల సంఖ్య 1321కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. లోక్‌సభ స్పీకర్‌తో రేపు వైకాపా ఎంపీల భేటీ

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను వైకాపా ఎంపీలు రేపు కలవనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, నందిగం సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయులు స్పీకర్‌తో భేటీ కానున్నారు. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని