టాప్ 10 న్యూస్‌ @ 9 PM
close

తాజా వార్తలు

Published : 09/07/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. TS: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రద్దు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. భారత్‌లో సమూహవ్యాప్తి లేదు: హర్షవర్ధన్‌

ప్రపంచంలోనే కరోనా కేసుల నమోదులో భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఈ పరిణామాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ‘‘మన దేశంలో ప్రతి పది లక్షల మందికి 538 కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1,453గా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 62.08 శాతం మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 2.75 శాతంగా ఉంది. భారత్‌లో సమూహవ్యాప్తి లేదు ’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆసియా కప్‌ 2021కి వాయిదా

కరోనా వైరస్‌ ముప్పు కారణంగా ఆసియాకప్‌-2020ని వాయిదా వేస్తున్నామని ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) అధికారికంగా ప్రకటించింది. 2021లో శ్రీలంక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ విషయాన్ని బుధవారమే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ ఏడాది నిర్వహణ హక్కులు పాకిస్థాన్‌ పొందింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. అక్టోబరు 1 నుంచి సీమ కరవు నివారణ పనులు

విద్యారంగంలో ఏడాదిన్నరలోగా నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘‘పాఠశాలలతోపాటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లోనూ నాడు-నేడుకు ప్రాధాన్యమివ్వాలి. అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరవు నివారణ పనులు ప్రారంభించాలి. పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు త్వరగా పూర్తి కావాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు త్వరగా పూర్తి చేయాలని’’ అని సీఎ జగన్‌ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. గ్లోబల్‌ గర్ల్‌అప్ సమావేశంలో ప్రియాంక చోప్రా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా, ప్రిన్స్‌ హ్యారీ సతీమణీ మెగన్‌ మార్కెల్‌, నోబల్‌ బహుమతి గ్రహీత నదియా మురాద్‌, ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్‌ సాండ్‌బర్గ్‌, నటి జమీలా జమిల్‌ వంటి అంతర్జాతీయంగా ప్రభావవంతమైన మహిళలు ఈ నెల 13-15 వరకు వర్చువల్‌ ‘గర్ల్‌అప్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌’లో పాల్గొనబోతున్నారు. వీరంతా ఈ సమ్మిట్‌లో లింగ సమానత్వంపై చర్చిస్తారట. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రియాంక చోప్రాను ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. జులై 15 నుంచి యస్‌ బ్యాంక్‌ భారీ ఎఫ్‌పీవో

యస్‌ బ్యాంక్‌ రూ.15వేల కోట్ల ఎఫ్‌పీవో (ఫర్‌దర్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌)కు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అవసరమైన పత్రాలను రెగ్యూలేటరీలకు అందజేసినట్లు గురువారం బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఆఫర్‌ జులై 15న మొదలై 17న ముగుస్తుంది. ఈ వారం మొదట్లో బ్యాంక్‌ క్యాపిటల్‌ రైజింగ్‌ కమిటీ నుంచి అనుమతి వచ్చిందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సరిహద్దుల్లో అంతా బాగానే ఉంది:  చైనా

భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం ఒక ప్రకటన  చేశారు. త్వరలోనే భారత్‌-చైనా సరిహద్దు వ్వవహారాలకు సంబంధించి వర్కింగ్‌ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్‌ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరగనుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అందుకోసమే ఆగస్టు 15కు వ్యాక్సిన్‌ అన్నాం!

ఆగస్టు 15లోపు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను‌ అందుబాటులోకి తీసుకురావాలన్న అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక రాజేశ్‌ భూషణ్‌ గురువారం స్పష్టత ఇచ్చారు. భద్రత విషయంలో  రాజీలేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌కు వేగవంతంగా అనుమతులు లభించేందుకే అలా అన్నారని తెలిపారు. ‘డీజీ-ఐసీఎంఆర్‌ లేఖలో ఆపాదించని అంశాలను దయచేసి చూడొద్దు’ అని ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. జూమ్‌.. చైనా కంపెనీ కాదండోయ్‌!

జూమ్‌.. లాక్‌డౌన్‌ కాలంలో కార్యాలయ అవసరాలు తీర్చుకొనేందుకు కోట్లాది మంది ఉపయోగించిన వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌. సెక్యూరిటీ లోపాలున్నాయని హెచ్చరించినా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే వాడుతున్నారు. పోటీగా జియోమీట్‌, గూగుల్‌ మీట్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ ఉన్నప్పటికీ డౌన్లులోడ్లు మరింతగా పెరిగాయి. దుందుడుకు చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత ప్రభుత్వం 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో దీనిపైనా అనుమానాలు వచ్చినప్పటికీ తమది ‘మేడిన్‌ చైనా’ యాప్‌ కాదని భారతీయులకు జూమ్‌ చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రానా కపూర్‌కు షాకిచ్చిన ఈడీ..ఆస్తుల జప్తు

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానా కపూర్‌, ఆయన కుటుంబానికి చెందిన పలు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. వీటి విలువ రూ. 2,200 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఈడీ ఆస్తులు జప్తు చేయడం ఇదే తొలిసారి. జప్తు చేసిన వాటిలో దిల్లీ, ముంబయి, గోవా నగరాల్లోన్ని వ్యవసాయ భూములతో పాటు లండన్‌, న్యూయార్క్‌లోని రూ.50 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని