close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/07/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. రూ.25 కోట్లతో అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి: కేసీఆర్‌

ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయ రంగం, రైతుబంధుపై సమీక్ష సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. 100 శాతం నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం శుభసూచకమన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసే విత్తనాల నిల్వకు శీతల గిడ్డంగి నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ. 25 కోట్లతో అతిపెద్ద అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కజక్‌ న్యూమోనియా కరోనా కావొచ్చు:WHO

కజక్‌స్థాన్‌లో గుర్తుతెలియనిదిగా భావిస్తున్న న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ మైకేల్‌ రేయాన్‌ అన్నారు. గతవారం ఆ దేశం ప్రయోగశాలల్లో ధ్రువీకరించిన 10వేల కొవిడ్‌-19 కేసులను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 50వేలకు పైగా కేసులు ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘కొత్త సచివాలయ భవనం కట్టాల్సిందే’

పాలనా సౌలభ్యం కోసం కొత్త సచివాలయ భవనం కట్టాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. మంత్రులు, ఐఏఎస్‌లు, సిబ్బంది వేర్వేరు చోట్ల ఉంటే ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. పాత సచివాలయంలో మరుగుదొడ్ల వసతి కూడా లేదని సంఘం నాయకులు తెలిపారు. ఆలయం, మసీదుకు జరిగిన నష్టంపై సీఎం కేసీఆర్‌ వివరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు చొప్పున ఇవ్వజూపుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇలాంటి కుట్రలకు పాల్పడడం సిగ్గు చేటు అని ఆయన దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘భారత్‌కు ట్రంప్‌ మద్దతా.. నమ్మకం లేదు’

భారత్‌-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే.. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై ఇటీవల పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా  మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరింత ముదిరితే.. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు అండగా ఉంటారన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కర్ణాటకలో నలుగురి దారుణ హత్య

కర్ణాటకలో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. రాయచూర్‌ జిల్లా సింధనూరులో నలుగురిని గుర్తు తెలియని ముఠా హత్య చేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. నలుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో సావిత్రమ్మ (55), శ్రీదేవి (38), హనుమేశ్‌ (35), నాగరాజు (33) ఉన్నారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

7. ఏపీలో కరోనా:1813 కేసులు.. 17 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1813 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రంలోని వారు 1775 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోని వారు 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మరో నలుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27,235కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ​​​​​రోగుల పాటి సంజీవని.. ధన్వంతరి రథ్‌

కరోనా కారణంగా ఆస్పత్రులన్నీ కిక్కిరిశాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ ఆస్పత్రులుగా రూపుదాల్చాయి. దాదాపు అన్ని ఆస్పత్రులు ఓపీ సేవలు నిలిపివేశాయి. దీంతో సాధారణ రోగులు ఆస్పత్రులకు రావడం తగ్గిపోయింది. ఈ పరిస్థితిని ఊహించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏంఎసీ) సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ధన్వంతరి రథ్‌ పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వ్యాక్సిన్‌ పంపిణీకి కఠిన నిర్ణయాలు అవసరం

కొవిడ్‌-19 ఔషధాలు, వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. ఎక్కువ బిడ్డింగ్‌ వేసేవాళ్లకు కాకుండా అవపరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ చేరాలని ఆయన సూచించారు. అసమానతలు చోటుచేసుకుంటే కరోనా వైరస్‌ మహమ్మారి మరింత కాలం ఉంటుందని హెచ్చరించారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ సొసైటీ కొవిడ్‌-19పై ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో గేట్స్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ట్రైనింగ్‌ కోసం ద్యూతిచంద్‌ కారు అమ్మకం!

కరోనా వైరస్‌ కష్ట కాలంలో తన ట్రైనింగ్‌ కోసం బీఎండబ్ల్యూ కారు అమ్మాలని నిర్ణయించుకుంది భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యూతిచంద్‌. ఈ మేరకు ఆమె తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టి తర్వాత దాన్ని తొలగించింది. 2015 బీఎండబ్ల్యూ 3 సిరీస్‌కు చెందిన కారును ద్యూతి కొంతకాలం క్రితం రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవ్వడానికి తన వద్ద తగినంత డబ్బు లేదని అందుకే ఆ కారును అమ్మాలనుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.