close

తాజా వార్తలు

Updated : 19/09/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏపీలో రూ.6400కోట్ల టెండర్లు రద్దు

ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన సర్కార్‌.. మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు పిలిచి.. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికాలేదని.. ఎక్కువ విలువైన పనుల్లో గుత్తేదార్లు తక్కువగా పాల్గొంటారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాజధానిపై  కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో గానీ లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే అర్హత 248 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆయన లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. క్రికెట్‌ ఫీవర్‌ ప్రారంభం.. 

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమైంది. దీంతో ఆరు నెలల తర్వాత అసలు సిసలైన క్రికెట్‌ సందడి మొదలైంది. యూఏఈ వేదికగా 53 రోజుల పాటు జరగనున్న ఈ సుదీర్ఘ టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో ముంబయి, చెన్నై తలపడుతున్నాయి. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

4. ఆ ఉత్పత్తుల అమ్మకంపై నిర్ణయం తీసుకోలేదు..!

దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ క్యాంటీన్లలో మేడ్‌-ఇన్-ఇండియా ఉత్పత్తులను మాత్రమే అమ్మాలనే నిర్ణయాన్ని రక్షణశాఖ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా, రక్షణశాఖ కేవలం దేశీయంగా తయారైన ఉత్పత్తులనే క్యాంటీన్లలో అమ్ముతోందా?అని పార్లమెంట్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. డిక్లరేషన్‌ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వివరణ

శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ₹2 వేల నోటుపై మరోసారి కేంద్రం క్లారిటీ

రూ.2వేల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి  అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో శనివారం ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు నోట్ల ముద్రణపై ఆర్‌బీఐను సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏటా 3లక్షల రోడ్డు ప్రమాదాలు వాటివల్లే..!

దేశవ్యాప్తంగా సంభవిస్తోన్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 71శాతం కేవలం అతివేగం వల్లే జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత సంవత్సరం(2019)లో దేశవ్యాప్తంగా 4.49లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా వాటిలో 3,19,028 ప్రమాదాలు కేవలం అతివేగం కారణంగానే సంభవించినట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఏపీలో కొత్త కేసులు మళ్లీ 8వేలకు పైనే..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 74,595 శాంపిల్స్‌ పరీక్షించగా.. 8218 పాజిటివ్‌ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. 10,820 మంది కొత్తగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 50,33,676 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,17,776 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అమెరికాపై డ్రాగన్‌ ఎదురు దాడి..

అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు మరో కీలక మలుపు తీసుకుంది. ఇంతవరకు తమ సంస్థలపై నిషేధం విధిస్తూ వస్తున్న అగ్రరాజ్యానికి తగిన జవాబు ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. హువాయి తదితర సంస్థలు, టిక్‌టాక్‌ వంటి యాప్‌లపై పలు ఆంక్షలు విధించిన అమెరికా నిర్ణయానికి ప్రతి చర్యగా చైనా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో నమ్మదగని సంస్థల జాబితాను సిద్ధం చేస్తున్నామంటూ చైనా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చైనాకు లీక్స్‌.. జర్నలిస్టు సహా ముగ్గురి అరెస్ట్‌

చైనా ఇంటిలిజెన్స్‌ విభాగానికి రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది వరకే ఈ కేసులో ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రాజీవ్‌ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ, మరో నేపాలీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరిద్దరూ సమాచారాన్ని చేరవేసిన సదరు జర్నలిస్టుకు పెద్ద మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.