close

తాజా వార్తలు

Updated : 24/09/2020 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఎస్పీబీ ఆరోగ్యంపై ఎంజీఎం హెల్త్‌ బులిటెన్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని, అన్ని మార్గాల్లోనూ ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది.‘‘కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం హెల్త్‌ కేర్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్‌ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నాం. గత 24గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఎస్పీబీ ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’’ అని ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌లో పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు సుమారు ఆరునెలల తర్వాత రోడ్డెక్కనున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణాశాఖకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అయితే 25 శాతం బస్సులను మాత్రమే నడిపేందుకు ఆయన అనుమతించారు. పరిస్థితిని బట్టి దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జియో జిల్‌.. ఎయిర్‌టెల్‌, వీఐకి షాక్‌!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో మరింత మంది చందాదారులు కొత్తగా చేరారు. జూన్‌ నెలలో కొత్తగా 45 లక్షల మంది చందాదారులు ఆ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ సంస్థ 39.72 కోట్ల సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా (వీఐ) తమ చందాదారులను కోల్పోయాయి. ఈ మేరకు తాజాగా టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) గురువారం గణాంకాలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పంజాబ్‌ VS బెంగళూరు

దుబాయి వేదికగా పంజాబ్‌, బెంగళూరు జట్ల మధ్య ఆరో లీగ్‌ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే కోహ్లీసేన ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించింది. మరోవైపు రాహుల్‌ జట్టు దిల్లీ చేతిలో సూపర్‌ ఓవర్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు బెంగళూరునైనా ఓడించి ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

5. నా విడుదల తేదీ బయటకి చెప్పొద్దు: శశికళ

జైలు నుంచి తాను ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని జయలలిత నెచ్చెలి వీకే శశికళ అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు లేఖ రాశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, జైలు నుంచి ఆమె విడుదలకు సంబంధించి ఊహాగానాలు వస్తున్న వేళ అధికారులకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు?: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షలు కొన్ని రోజులు ఎక్కువగానూ మరి కొన్నిరోజులు తక్కువగా చేస్తున్నారని అభిప్రాయపడింది. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపిందని.. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చట్టప్రకారం 3 రాజధానులు సాధ్యంకాదు: గల్లా

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలు, రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెదేపా లోక్‌సభాపక్ష నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చట్ట ప్రకారం సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కలిసి అమరావతి విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన తమ అభిప్రాయాలతో ఏకీభవించినట్లు గల్లా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఏపీలో తగ్గినట్లే.. మళ్లీ పెరుగుతున్న కేసులు

ఏపీలో తగ్గినట్లే కనిపించిన కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 76,000 పరీక్షలు నిర్వహించగా 7,855 మంది కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,54,385కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 8,807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 52 మంది  మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. డ్రగ్స్‌ కేసు: రేపు రకుల్‌‌.. ఎల్లుండి దీపిక!

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మరణానంతరం డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) తాజాగా ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌కు సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. శనివారం విచారణకు హాజరు కానున్నట్టు దీపిక తెలిపారని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. రకుల్ రేపు ఎన్సీబీ ముందు హాజరు కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. డెంగీ వ్యాక్సిన్‌: కీలక అధ్యయనం పూర్తి!

డెంగీ వ్యాక్సిన్‌ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు తయారుచేసిన ‘డెంగీ ఆల్‌’ వ్యాక్సిన్‌ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం పూర్తైనట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ పనాసియా బయోటెక్‌ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ పరిశోధన ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను సంప్రదించినట్లు పనాసియా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.