close

తాజా వార్తలు

Published : 27/09/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘నెల్లూరులో సంగీత వర్సిటీ ఏర్పాటు చేయండి’

అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఏటా ఎస్పీబీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని.. సంగీత వర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని  కోరారు. ఆ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజస్థాన్ vs పంజాబ్

ఐపీఎల్ తొమ్మిదో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో పంజాబ్ తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ వేగంగా పరుగులు రాబడుతోంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ ను కట్టడి చేసేందుకు రాజస్థాన్ బౌలర్లు యత్నిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ఆ రెండు దేశాల నుంచే ఎక్కువ కేసులు!

భారత్‌లో కరోనా తీవ్రత ఉద్ధృతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో వైరస్‌ ఎక్కువగా వ్యాపించడానికి రెండు దేశాల ప్రయాణికులే మూలమని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా దుబాయ్‌, యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఐఐటీ-మండీ విశ్లేషణాత్మక అధ్యయనం పేర్కొంది. ట్రావెల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ఈ తాజా అధ్యయనం ప్రచురితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘ప్రపంచానికి టీకా సహాయం’ ఎంతో గర్వకారణం!

భారత కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందించేందుకు‌ సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగిన విషయమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధార్‌ పునావాలా అన్నారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రపంచదేశాలకు మోదీ ఇచ్చిన ఆ హామీపై ఆయన ప్రశంసలు కురింపించారు. ఈమేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఉద్ధవ్‌తో శరద్‌ పవార్‌ భేటీ

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ఆదివారం భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ భేటీ జరిగి 24 గంటలకు గడవకముందే వీరి సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దేనిపై చర్చించారన్నది మాత్రం వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీకాంగ్రెస్‌ సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికలు జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు పలు సూచనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హ్యూందాయ్‌ సూపర్‌ కార్‌ ఇదిగో..!

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యూందాయ్‌ మోటార్‌ కంపెనీ సరికొత్త సూపర్‌ కార్‌ను పరిచయం చేసింది. నెక్స్ట్‌ జనరేషన్‌ కు చెందిన ఆర్‌ఎం20ఈ కారును బీజింగ్‌ మోటార్‌షోలో తొలిసారి ప్రదర్శించింది. అత్యాధునికమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించింది. భవిష్యత్తు తరానికి అవసరమైన అత్యధిక సామర్థ్యం ఉన్న ఆర్‌ఎం కార్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టును హ్యూందాయ్‌ 2012లో చేపట్టింది. దీనిలో ఆర్‌ఎం 14, 15, 16, 19 కార్లు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీలో కరోనా.. 6,923 కొత్త కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజు వ్యవధిలో 76,416 నమూనాలను పరీక్షించగా.. 6,923 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 6,75,674కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 7,796 మంది కరోనా నుంచి కోలుకోగా.. 45 మంది మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అవును.. మేం నష్టపోతున్నాం: అఫ్రిది

భారత్ నిర్వహించే టీ20 టోర్నీలో తమ దేశ ఆటగాళ్లకు చోటు లేకపోవడంపై పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ స్థాయి పోటీ క్రికెట్‌కు వేదిక అయిన ఆ లీగ్‌లో తమ ఆటగాళ్లు ఆడకపోవడం వల్ల నష్టపోతున్నామని వాపోయాడు. ‘‘భారత్ నిర్వహించే టీ20 టోర్నీకి ఎంతో బ్రాండ్ ఉంది. బాబర్‌ అజామ్, ఇతర పాక్‌ క్రికెటర్లు ఆ లీగ్‌లో ఆడితే ఒత్తిడిలో రాణించడానికి అలవాటు పడతారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత విధానాల వల్ల అతి పెద్ద క్రికెట్ వేదికలో మా ఆటగాళ్లు చోటు కోల్పోతున్నారు’’ అని పాకిస్థాన్‌ మీడియాలో అఫ్రిది వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.