టాప్ 10 న్యూస్‌ @ 9 PM
close

తాజా వార్తలు

Published : 20/10/2020 20:56 IST

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే

కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దు.  కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలివే..!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్టు కనబడుతోంది. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,32,795 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 46,790 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 67శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్‌-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. దిల్లీ vs పంజాబ్‌

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. దుబాయ్ వేదికగా దిల్లీ, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ శిఖర్‌ ధావన్ అర్ధశతకం బాదాడు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’కు యూకే ఓకే!

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా అంచనా వేయగలిగే ‘హ్యూమన్‌ ఛాలెంజ్’ ప్రయోగాల‌కు యూకే ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఈ అధ్యయనం కోసం 33.6 మిలియన్‌ పౌండ్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ఇంపీరియల్‌ కాలేజీ భాగస్వామ్యంతో అధ్యయనం చేపట్టనుంది. నియంత్రణ సంస్థలు, ఎథిక్స్‌ కమిటీల ఆమోదం పొందిన వెంటనే ఈ అధ్యయనం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీలో నవంబర్‌ 2నుంచి పాఠశాలలు ప్రారంభం

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్పందించారు. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో రోజువిడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే: నాదెండ్ల మనోహర్‌

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం పూర్తిగా ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దసరాకు సొంతూళ్లకు రాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్వగ్రామాలకు రావాలనుకునే వారికి నిరాశే మిగిలిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఇక వాట్సాప్‌ వెబ్‌లోనూ ఆ ఫీచర్‌

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. తాజాగా మొబైల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో/వాయిస్‌ కాల్‌ ఫీచర్‌ని వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ యూజర్స్‌కి మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 69,095 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,503 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 28 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,481 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 5,144 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,49,676కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అవసరమైతే చిరాగ్ సహకారం : తేజస్వి

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత అవసరమైతే తాము చిరాగ్ పాసవాన్ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్ మంగళవారం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవీ నివాసానికి వెళ్లిన నేపథ్యంలో తేజస్వి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఆ దేశాలకు పెరుగుతున్న భారతీయుల వలసలు!

ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) కూటమిలోని సభ్య దేశాలకు భారత్‌ నుంచి వలసలు భారీగా పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ ఔట్‌లుక్‌ 2020’ వెల్లడించింది. ఓఈసీడీకి వలస వెళ్తున్న జాబితాలో చైనా ముందుండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయా దేశాల పౌరసత్వం తీసుకోవడంలోనూ భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని