close

తాజా వార్తలు

Published : 24/10/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. దిల్లీ చిత్తు: ప్లేఆఫ్స్‌ వైపు కోల్‌కతా

కోల్‌కతా అద్భుతం చేసింది. కీలకమైన సమయంలో ప్లేఆఫ్స్‌ రేసులో ముందడుగు వేసింది. దిల్లీపై తిరుగులేని విజయం సాధించింది. సమీకరణాలతో సంబంధం లేకుండా ఉండేందుకు రన్‌రేట్‌ను సైతం పెంచుకుంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (5/20), ప్యాట్‌ కమిన్స్‌ (3/17) దెబ్బకు దిల్లీ విలవిల్లాడింది. 195 పరుగుల లక్ష్య ఛేదనలో 135/9కే పరిమితమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (47; 38 బంతుల్లో 5×4), రిషభ్‌ పంత్‌ (27; 33 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవ్వరూ రాణించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆదాయపన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు

ఆదాయపన్ను చెల్లింపు దారులకు వెసులుబాటు కలిగిస్తూ ఆర్థిక శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి గడువును పొడిగించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను డిసెంబర్‌ 31 లోగా చెల్లించే వీలు కలుగుతుంది. ఇక ఆడిటింగ్‌ అనంతరం పన్ను చెల్లించేవారు మరో నెల అనంతరం అంటే జనవరి 31, 2021 లోగా సమర్పించవచ్చని ఆ శాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. హైదరాబాద్ vs పంజాబ్‌

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన సమరం జరుగుతోంది. దుబాయ్ వేదికగా హైదరాబాద్‌, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ఆ నష్టానికి బాధ్యులెవరో చెప్పాలి:బండి సంజయ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తాను చెప్పిన పంటనే సాగు చేయాలంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని అగాథంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ మాటలు నమ్మి, సన్నరకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారని అన్నారు. రైతులకు జరిగిన నష్టానికి బాధ్యులెవరని బండి సంజయ్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మా కూటమి దేశానికి వ్యతిరేకం కాదు: ఫరూక్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) పోరాటం చేస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. తమది భాజపా వ్యతిరేక వేదికే తప్ప దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. పీఏజీడీ దేశ వ్యతిరేకి అంటూ భాజపా అసత్య ప్రచారం చేస్తోందని, అది నిజం కాదన్నారు. ఇది భాజపా వ్యతిరేక కూటమి అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదని విలేకర్ల సమావేశంలో అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘చైనా ఎల్లో డస్ట్‌’తో..వణుకుతున్న ఉ.కొరియా!

చైనా నుంచి వస్తోన్న ‘ఎల్లో డస్ట్‌’తో ఉత్తర కొరియా వణికిపోతోంది. తాజాగా దేశవ్యాప్తంగా అలెర్ట్‌ ప్రకటించడంతోపాటు, నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలను కూడా బంధించి పెట్టుకోవాలని అక్కడి అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌(KCTV)ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి వస్తోన్న ‘ఎల్లో డస్ట్’‌ వల్ల కరోనావైరస్‌ కిమ్‌ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతోనే ఉ.కొరియా ఈచర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కరోనా ఎఫెక్ట్‌: యువతలో పెరిగిన ఆందోళన..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై పడుతోంది. తాజాగా మనదేశ యువతపైనా ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది. గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడంతోపాటు చదువుకు కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అది మేనిఫెస్టో ప్రకటన...

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మేనిఫెస్టోలో ఉచిత కరోనా వైరస్‌ టీకా హామీ ఇచ్చిన భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. దీనిపై శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ఆమె గురువారం మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా తాము బిహార్‌లో అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు, ఉచితంగా టీకాను అందిస్తామంటూ హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీకా హామీపై విపక్షాలన్నీ విరుచుకుపడటంతో పాటు, చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ధోనీ జెర్సీలిస్తున్నాడు.. ఇదే ఆఖరి సీజనా?

ఆగస్టు 15న టీమ్‌ఇండియా క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్‌ నుంచి కూడా తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం తన జెర్సీని జోస్‌బట్లర్‌కు బహుమతిగా ఇచ్చిన ధోనీ.. శుక్రవారం రాత్రి ముంబయితో మ్యాచ్‌ అనంతరం పాండ్య బ్రదర్స్‌కు కూడా అలాగే చేశాడు. తన 7వ నంబర్‌ జెర్సీని  బహూకరించాడు. ఈ ఫొటోను లీగ్‌ నిర్వహకులు తమ ట్విటర్‌లో పోస్టు చేయగా పలువురు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,342 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,566 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.