టాప్ 10 న్యూస్‌ @ 9 PM
close

తాజా వార్తలు

Updated : 25/10/2020 21:06 IST

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. గైక్వాడ్‌ అదుర్స్‌: చెన్నై గెలిచిందోచ్‌

ధోనీసేనకు ఊరట.. వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆ జట్టును ఎట్టకేలకు ఓ విజయం వరించింది. బెంగళూరును 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (65; 51 బంతుల్లో 4×4, 3×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా అంబటి రాయుడు (39; 27 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్‌ (25; 13 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. బెంగళూరు బౌలర్లు మందకొడి పిచ్‌పై వేగంగా బంతులేసి మూల్యం చెల్లించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే

విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆర్‌బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఆదివారం ట్వీట్‌ చేశారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ముంబయి vs రాజస్థాన్

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. అబుదాబి వేదికగా ముంబయి, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిని ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబయి బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్‌ చేయండి

5. నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ కన్ను్ల పండువగా సాగింది. కరోనా వ్యాప్తి, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఉత్సవమూర్తుల నదీ విహారాన్ని అధికారులు నిలిపివేశారు. దుర్గాఘాట్‌లోని నది ఒడ్డునే హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రెండోసారి.. అందుకోసమే ట్రంప్‌ ఆరాటం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలోనూ ట్రంప్‌కు సరైన ప్రణాళిక లేదని విరుచుకుపడ్డారు. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తరపున ఒబామా ప్రచారం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. 32 మంది నక్సల్స్‌ లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. WhatsApp: చాటింగ్‌తో షాపింగ్‌ చేసేలా..!

వినియోగదారుల కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం ‘చాట్‌ షాపింగ్‌’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఉత్పత్తుల జాబితా చూసుకోవడం, వస్తువులను ఆర్డర్ చేయడం, పేమెంట్‌, చెక్‌ ఔట్‌ వంటివన్నీ ‘వాట్సప్‌ చాట్’‌ ద్వారానే చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. వాట్సప్‌ బ్లాగ్‌ పోస్ట్‌ను బట్టి ఒక్క యాప్‌తోనే వ్యాపారం నిర్వహించుకునేలా కొత్త ఫీచర్స్‌ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. చైనా, పాక్‌లతో యుద్ధం.. తేదీలు ఫిక్స్‌!

పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని, ఈ మేరకు  తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడారు. భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వార్తల్లోకెక్కారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఇన్నేళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది: రేణుదేశాయ్‌

ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత నేపథ్యంగా ఆద్య అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు నిర్మాతగా నూతన దర్శకుడు కృష్ణ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు భాషల్లో నిర్మించనున్న ఆద్య వెబ్ సిరీస్‌ను హైదరాబాద్‌లోని డీఎస్ రావు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని