close

తాజా వార్తలు

Published : 27/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఆస్పత్రికి బండి సంజయ్‌ తరలింపు

తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం హుటాహుటిన అంబులెన్స్‌లో నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. సంజయ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో భాజపా కార్యకర్తలు భారీగా ఆయన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఇకపై అక్కడ ఎవరైనా భూమి కొనొచ్చు!

జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో ఇకపై ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం భారతీయ పౌరులెవరైనా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో భూవిక్రయాలు జరపవచ్చు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసిగా ఉన్నవారే అక్కడ భూమి కొనుక్కోవచ్చని గతంలో ఉన్న డొమిసైల్‌ ఆప్షన్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా తొలగించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. దిల్లీ vs హైదరాబాద్‌

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. దుబయ్‌ వేదికగా హైదరాబాద్, దిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ఈ రూపే కార్డుతో తక్కువ ధరకే రైలు టిక్కెట్లు!

దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం చేసే వారందరూ దాదాపు ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఇటీవల ఐఆర్‌సీటీసీతో కలిసి అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ రూపే కార్డును తీసుకొచ్చింది. ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సంగెం వద్ద బావిలోకి దూసుకెళ్లిన జీపు

వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద జీపు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది.  వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా రోడ్డు సరిగా లేకపోవడంతో జీపు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో 15 మంది జీపులో ఉండగా వారిలో 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపుతో పాటు మరో నలుగురు బాధితులు బావిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. శంషాబాద్‌ విమానాశ్రయం అరుదైన ఘనత

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఆర్‌జీఐఏ ఘనత సాధించింది. ఆత్మనిర్భర్‌ స్ఫూర్తితో అంతర్గతంగా ఈ-బోర్డింగ్‌కు రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో గుర్తింపు పొందింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆ కుటుంబానికి కృతజ్ఞతలు: ధోనీ 

తమిళనాడులో ఓ అభిమాని ధోనీ పేరు, చిత్రాలతో ఏకంగా ఇల్లు నిర్మించాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఆ ఇంటిని ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. తాజాగా ఆ ఇంటిపై ధోనీ స్పందించాడు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఇల్లును నేనూ చూశాను. ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఆ అభిమాని కేవలం నా ఒక్కడికి కోసమే కాదు.. చెన్నై జట్టుపై అభిమానంతో ఇల్లు నిర్మించాడు. నిజానికి ఆ విషయంలో కుటుంబ సభ్యులంతా ఒకే నిర్ణయంపై ఉండటం పెద్ద విషయం. ఆ కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు’ అని ధోనీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. చిరాగ్‌తో ఎన్డీయేకు సంబంధం లేదు: ఠాకూర్‌

బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న  రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎల్జేపీ నేత చిరాగ్‌ కేంద్రంలో భాజపాతో అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. భాజపా నాయకులు మాత్రం ఆ పార్టీపై విమర్శలు చేస్తుండడం గందరగోళం సృష్టిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఎల్జేపీ నేత చిరాగ్‌ను ఎవరూ విశ్వసించరంటూ విమర్శలు చేశారు. ఆయన పార్టీతో ఎన్డీయేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ₹కోట్లు ఖరీదు చేసే కారును తగలబెట్టేశాడు

వాహనాల్ని ఎంతో ముచ్చటపడి కొనుక్కుంటాం. కొన్న కొత్తలో వాహనంలో ఏవైనా సమస్యలు వస్తే వాహన డీలర్‌ వద్దకి తీసుకెళ్లి పరిష్కరించుకుంటాం. అయినా సమస్య తీరకుంటే డీలర్‌కు పైస్థాయి వ్యక్తులకు ఫిర్యాదు చేస్తాం.. కానీ, ఓ వ్యక్తి తన కారులో ఏర్పడిన సమస్యకు పరిష్కారం చూపలేదని కారు డీలర్‌పై కోపంతో ఏకంగా రూ. కోట్లు విలువ చేసే కారును పెట్రోల్‌పోసి తగలబెట్టేశాడు. ఆ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో కరోనా.. 2,901 కొత్త కేసులు

ఏపీలో కరోనా బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 74,757 నమూనాలను పరీక్షించగా 2,901 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6,625కి చేరింది. ఒక్కరోజులో 4,352 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.