close

తాజా వార్తలు

Published : 29/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. లక్ష టన్నుల ఉల్లి సరఫరా: తోమర్‌

ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. లక్ష టన్నుల ఉల్లిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాలకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించామని, ఇతర దేశాల నుంచి మరింత ఉల్లిని దిగుమతి చేసేందుకు మార్గాలు సుగమం చేశామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పుల్వామాదాడి మా విజయం: పాక్‌

పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. ‘భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది. మనమంతా ఆ విజయంలో భాగస్వాములం’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. చెన్నై vs కోల్‌కతా

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. దుబాయ్ వేదికగా చెన్నై, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో మద్యం ధరలు తగ్గించిన ప్రభుత్వం

రాష్ట్రంలో మద్యం ధరల్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మద్యం ధరలను తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్‌ను అబ్కారీ శాఖ విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో తయారయ్యే విదేశీ మద్యంలో మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరలను తగ్గించింది. రూ.50 నుంచి రూ.1,350 వరకు వివిధ కేటగిరీల్లో ధరలను తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సచివాలయ నిర్మాణపనులు షాపూర్‌జీ పల్లోంజీకే

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రూ.494 కోట్లకు టెండర్‌ ఆహ్వానించగా.. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4 శాతం.. ఎల్‌అండ్‌టీ 4.8 శాతం ఎక్కువగా కోట్‌ చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు చికిత్స:జగన్‌

వచ్చే నెల 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అవసరమనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను కూడా జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య శాఖలో ‘నాడు-నేడు’ పనులపై సీఎం సమీక్షించారు. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీపైనా చర్చించారు. నాడు-నేడు కింద చేపట్టనున్న పనులకు సంబంధించి నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, ఇప్పటికే జరుగుతున్న పనులపై అధికారులను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్‌ వాహన పాలసీ

ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడిస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ ఫ్యామిలీని త్వరలోనే కలుస్తా: కపిల్‌దేవ్‌

ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రి పాలై కోలుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు. తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1983లో ప్రపంచకప్‌ సాధించిపెట్టిన తన జట్టు (ఫ్యామిలీ) సభ్యులను కలవాలని ఉందని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. 1983 వరల్డ్‌కప్‌ టీమ్‌ సభ్యుల వాట్సాప్‌ గ్రూప్‌లో దీన్ని పోస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఆయన ప్రధాని.. ఏదైనా మాట్లాడొచ్చు: తేజస్వి

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన ‘జంగిల్‌ రాజ్‌ కా యువరాజ్’ వ్యాఖ్యలపై మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ స్పందించారు. అవినీతి, నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షోభం వంటి అసలైన సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోకుండా.. అనవసరమైన వ్యాఖ్యలు చేశారని కౌంటర్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.