close

తాజా వార్తలు

Updated : 14/01/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఇంకా 13.2 ఓవర్లు మిగిలుండగానే గెలవడం గమనార్హం. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (128; 112 బంతుల్లో 17×4, 3×6), ఆరోన్‌ ఫించ్‌ (110; 114 బంతుల్లో 13×4, 2×6) అజేయ శతకాలతో అదరగొట్టారు. భారత్‌పై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మళ్లీ జరిగితే చేతులు కట్టుకుని కూర్చోం:పవన్‌

తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైకాపా నేతలు దూషించి దాడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వైకాపా నేతల భాష దారుణంగా ఉందన్నారు. కాకినాడలో ఇటీవల వైకాపా దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్‌ పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోం’ అని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజధాని మారిస్తే ‘న్యాయ’ చిక్కులు: సుజనా

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనను అమలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.4లక్షల కోట్లు అవసరమని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. సీఎం జగన్‌కు మంగళవారం ఆయన 10పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారని.. దానికి కొనసాగింపుగా మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికిప్పుడు రాజధాని మార్చటం అంటే న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన అవస్థల్ని కొనితెచ్చుకోవడమేనని సుజనా హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్‌ ఎవరంటే!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు. 59 ఏళ్ల మైఖేల్‌ పాత్రా ప్రస్తుతం ఆర్బీఐ పరిశోధన విభాగంలో ద్రవ్య విధాన కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ గవర్నర్‌గా ఆయనకు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఆర్బీఐ వర్గాల సమాచారం మేరకు ఆయనకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇన్‌ఛార్జ్‌  బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బండలాగుడు పోటీలను తిలకించిన సీఎం జగన్‌

కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలను సీఎం తిలకించారు. పోటీల నిర్వహణ తీరును మంత్రి కొడాలి నాని తదితరులు జగన్‌కు వివరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంతకుముందు చిన్నారులపై సీఎం భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు.

6. డీజీపీని కలిసిన అమరావతి రైతులు, మహిళలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో వారు చర్చించారు. శాంతియుతంగానే ధర్నాలు చేస్తున్నామని సవాంగ్‌కు రైతులు వివరించారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

7. నాగం పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని మాజీ మంత్రి నాగం జానార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. భగ్గుమన్న గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. 1999 జాతీయ శిబిరంలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న ఇదే వ్యక్తి హైదరాబాద్‌ను వదలి ప్రకాశ్‌ పదుకొణె అకాడమీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. తన బయోగ్రఫీలోని ‘బిట్టర్‌ రైవల్‌రీ’ అధ్యాయంలో సైనా తన అకాడమీ వీడడం బాధాకరమని గోపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వారికి కూడా అవగాహన కల్పించాలి..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల వెల్లడించిన అభిప్రాయంపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి స్పందించారు. ‘అక్షరాస్యులకు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనడానికి ఇది ఒక సరైన ఉదాహరణ. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌లో వేధింపులకు గురైన మైనారిటీలకు తప్పక అవకాశాలు కల్పించడమే సీఏఏ తీసుకురావడానికి కారణం. అయినా అమెరికాలో యాజిదీలకు అవకాశం ఇచ్చినట్లుగా సిరియా నుంచి వచ్చిన ముస్లింలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు’ అని పేర్కొంటూ ట్వీట్‌లో ఆశ్యర్యం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. తెలంగాణలో ఘనంగా పతంగుల పండుగ

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.