
తాజా వార్తలు
ఆ డాక్టర్‌పై ప్రజా భద్రతా చట్టం..!
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) ప్రయోగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో భాగంగా విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణల కింద కఫీల్‌ను పోలీసులు గత నెల ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రపంగానికి సంబంధించిన కేసులో బెయిల్ లభించినప్పటికీ ఆయన్ని ఇంకా జైల్లోనే ఉంచారు. తాజాగా ఎన్ఎస్ఏ ప్రయోగించడంతో ఇక జైల్లోనే ఉంటారని పోలీసు అధికారి ఆకాశ్ కుల్హరి తెలిపారు. ఓ వ్యక్తి వల్ల దేశ ప్రయోజనాలు లేదా శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అధికారం ఉంటుంది. ముందస్తు చర్యల్లో భాగంగా సదరు వ్యక్తిని జైల్లోనే ఉంచవచ్చు.
డిసెంబర్ 12న సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ)లో జరిగిన నిరసనల్లో కఫీల్ ఖాన్ ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా ఉన్నాయని అలీగఢ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కఫీల్‌ని ముంబయి ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అలీగఢ్ ఠాణాకు తరలించారు. 2017లో గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీలో 60 మంది చిన్నారుల మరణాల కేసులోనూ కఫీల్ అరెస్టయ్యారు. అనంతరం జరిగిన విచారణలో ఆయన నిర్దోషిగా తేలారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
