close
Array ( ) 1

తాజా వార్తలు

నవంబరు 24.. ఈ రోజు ఎన్టీఆర్‌కు ఎంతో ప్రత్యేకం

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు వారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం ‘మన దేశం’. పోలీసు పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించిన ఈ చిత్రం నేటితో 70 వసంతాలు పూర్తి చేసుకుంది. సామాజిక దృక్పథం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ‘విప్రదాస్‌’ అనే బెంగాలీ నవల ఆధారంగా దర్శకుడు ఎల్‌.వి. ప్రసాద్‌ తెరకెక్కించారు. కృష్ణవేణి కథానాయిక. అలనాటి ప్రముఖ నటుడు ఎస్‌.వి.రంగారావు కూడా ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరావుకు ఇదే తొలి సినిమా. భారత స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో వచ్చి ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకొచ్చింది. 1949 నవంబరు 24న విడుదలైన ఈ ఆణిముత్యం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.