నితిన్‌తో ఇస్మార్ట్‌ భామ?
close

తాజా వార్తలు

Published : 20/08/2020 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌తో ఇస్మార్ట్‌ భామ?

హైదరాబాద్‌: కథానాయకుడు నితిన్‌ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘రంగ్‌ దే’, ‘అంధాదున్‌’ రీమేక్‌ చిత్రాలతో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాయి. నితిన్‌ వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కాగా, హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌’ తెలుగులో రీమేక్‌ అవుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో నితిన్‌ సరసన ‘ఇస్మార్ట్‌’భామ నభా నటేష్‌ని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాయి చిత్ర వర్గాలు. ఈ సినిమాలో మధ్య వయస్కురాలి పాత్ర కూడా కీలకం. హిందీలో టబు పోషించిన ఆ పాత్ర కోసం తెలుగులో నయనతారని సంప్రదిస్తున్నారు. త్వరలోనే ఈ పాత్రలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని