బాలకృష్ణ కెరీర్‌లో ఈ రోజు ప్రత్యేకం
close

తాజా వార్తలు

Published : 30/08/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ కెరీర్‌లో ఈ రోజు ప్రత్యేకం

ఇంటర్నెట్‌డెస్క్‌: తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘంగా డైలాగ్‌లు చెప్పడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇక నటుడిగా మాస్‌లో ఆయనకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు దర్శక-నిర్మాతలంటే ఆయనకు అమిత గౌరవం.

ఆగస్టు 30వ తేదీతో ఆయన వెండితెరకు పరిచయం అయి 46ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రం ద్వారా బాలకృష్ణ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విడుదలైన(30/08/1974) సరిగ్గా నేటికి 46ఏళ్లు. ఈ సందర్భంగా సామాజకి మాధ్యమాల వేదికగా బాలకృష్ణకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలయ్య పోషించిన వివిధ పాత్రలతో తీర్చిదిద్దిన లోగోలు, డీపీలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఒక పాత్రలో అఘోరగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని