మద్యం వేళలు పెంచడం నిషేధంలో భాగమా?
close

తాజా వార్తలు

Published : 26/07/2020 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యం వేళలు పెంచడం నిషేధంలో భాగమా?

నారా లోకేశ్‌


అమరావతి: రాష్ట్రంలో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు లేవని తెదేపా నేత నారా లోకేశ్‌ ఆరోపించారు. కనీసం సరైన భోజనం లేదంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. కరోనా కారణంగా రోడ్లపైనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ జెటాక్స్‌ వసూళ్ల కోసం పరితపిస్తున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరిచి ఉంచాలన్న ఆదేశాలు దుర్మార్గమని మండిపడ్డారు. మద్యం దుకాణాలు ఇప్పటికే కరోనా కేంద్రాలుగా మారిపోయాయని అన్నారు. ధరలు పెంచి మద్యపాన నిషేధం చేస్తున్నామని గొప్పలు చెప్పారని, రాత్రి 9 వరకు పెంచడం కూడా అందులో భాగమేనా అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని