close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120061250 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => mv_9POwdWTc [video_short_link] => mv_9POwdWTc [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-05-07 12:13:11.750207 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120061250 [video_srlno] => 2 [video_type] => 1 [video_link] => 5T9DWuwOmYQ [video_short_link] => 5T9DWuwOmYQ [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-05-07 12:13:11.815213 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 07/05/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖ ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి

దిల్లీ: విశాఖ పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు ట్విటర్‌ ద్వారా స్పందించారు. విశాఖ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో మాట్లాడిన ప్రధాని మోదీ...  అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

‘విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై హోం శాఖ, విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడా. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. విశాఖలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘విశాఖ శివారులోని ఓ ప్రైవేటు పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘విశాఖ ఘటన మనసును కలచివేసింది. ఘటనపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’:  అమిత్‌ షా

‘విశాఖ పాలీమర్‌ పరిశ్రమ దుర్ఘటన బాధాకరం. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాక చర్యలు చేపట్టాయి. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’: నిర్మలా సీతారామన్‌.

‘విశాఖ ఘటన బాధాకరం. సమీపంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు పూర్తి తోడ్పాటును అందించాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలి’: రాహుల్‌ గాంధీ

‘ విశాఖ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా  సానుభూతి. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ ఏడాది చాలా భయంకరంగా ఉంది’: కేటీఆర్‌

‘విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ఒక దురదృష్టకర సంఘటన. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

 




Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.