
తాజా వార్తలు
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సర్వీస్.. నెటిజన్స్ ఫన్నీ మీమ్స్
ట్రెండింగ్‌లో #NetflixStreamFest
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. NetflixStreamFest పేరుతో రెండురోజులపాటు భారత్‌లో ఫ్రీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 5(శనివారం) ఉదయం 12 గంటల నుంచి డిసెంబర్ 6(ఆదివారం) అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకూ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులు ఏ ప్రోగ్రామ్‌నైనా ఉచితంగానే చూడవచ్చు. మరోవైపు ఈ స్పెషల్ ఆఫర్ పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్రీ సర్వీస్‌ను బాగా ఉపయోగించుకుని అన్ని వెబ్‌సిరీస్‌లు చూసేయాలనుకుంటున్నట్లు సరదాగా పోస్టులు పెడుతున్నారు. దీంతో పలు ఫన్నీ మీమ్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో కొన్ని..
Tags :