close
Array ( ) 1

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌

మౌంట్‌ మాంగనుయ్‌: భారత్‌ x న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే 4-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌ ఈ మ్యాచ్‌ కూడా గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో విజయం ముంగిట వరకు వెళ్లి అనూహ్యంగా సూపర్‌ ఓవర్లలో ఓటమిపాలైన న్యూజిలాండ్‌ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. కాగా,  ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటుండగా రోహిత్‌ శర్మ జట్టు పగ్గాలు తీసుకున్నాడు.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌, రోహిత్‌శర్మ(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివమ్‌దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకుర్‌, నవ్‌దీప్‌సైని, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

న్యూజిలాండ్‌ జట్టు: మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మన్రో, టిమ్‌ సీఫెర్ట్‌, రాస్‌టేలర్‌, టామ్‌ బ్రూస్‌, డారిల్‌ మిచెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, స్కాట్‌ కుగెలిన్‌, టిమ్‌ సౌథీ, ఇష్‌ సోధి, హమిష్‌ బెనెట్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.