విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన
close

తాజా వార్తలు

Updated : 13/07/2020 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన

దిల్లీ: విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు. కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్‌కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈమేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని